HomeUncategorizedVizag vision: ఆత్మనిర్భర్ పెట్టుబడిదారునిగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం తణుకు, జనవరి 2025: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) యొక్క ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును స్థానిక SKSD మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై దృష్టి సారించి, పెట్టుబడిదారులకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సాధికారతను కలిగించటమే కాక, పెట్టుబడి యొక్క ప్రధాన సూత్రాలను విద్యార్థులకు వివరించటం జరిగినది. ప్రధానంగా అందరికి అర్థం అయ్యే రీతిలో ఈ కార్యక్రమం తెలుగు బాష లో వక్తలు నిర్వహించటం వలన ప్రాంతీయ పెట్టుబడిదారులకు అత్యంత సులభంగా పెట్టుబడులు & డిపాజిటరీ సేవల ప్రాథమిక అంశాలు అర్థం చేసుకునే వీలు కలిగినది. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు. CDSL IPF పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్ లో అవగాహన కలిగించటంలోను మరియు మార్కెట్ సంక్లిష్టతలను పరిశోధించుటలోను CDSL IPF కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడిదారులను ఆత్మనిర్భర్ పెట్టుబదిదారునిగా తీర్చిదిద్దుతకు కావలసిన పరిజ్ఞానం మరియు నైపుణ్యాతలను అందించాలనే లక్ష్యంతో CDSL IPF ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు గురించి పరిజ్ఞానం విస్తరింప చేయుటకు కట్టుబడి, CDSL IPF ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించుటకు ఉద్యమిస్తున్నాది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) IPF భారతదేశం అంతటా పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాది. గత ఆర్ధిక సంవత్సరం 2023-24లో CDSL IPF దేశ వ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ మరియు 16 ఇతర ప్రాంతీయ బాషలలో పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలు (IAP) నిర్వహించాతమే కాక సుమారు 1.45 లక్షల మంది పెట్టుబడిదారులకు చక్కని అవగాహన కలిగించి చేరువైనది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ అవగాహన సదస్సులను ప్రాంతీయ బాషలలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియచేసారు.
Vizag vision: ఆత్మనిర్భర్ పెట్టుబడిదారునిగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం తణుకు, జనవరి 2025: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) యొక్క ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును స్థానిక SKSD మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై దృష్టి సారించి, పెట్టుబడిదారులకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సాధికారతను కలిగించటమే కాక, పెట్టుబడి యొక్క ప్రధాన సూత్రాలను విద్యార్థులకు వివరించటం జరిగినది. ప్రధానంగా అందరికి అర్థం అయ్యే రీతిలో ఈ కార్యక్రమం తెలుగు బాష లో వక్తలు నిర్వహించటం వలన ప్రాంతీయ పెట్టుబడిదారులకు అత్యంత సులభంగా పెట్టుబడులు & డిపాజిటరీ సేవల ప్రాథమిక అంశాలు అర్థం చేసుకునే వీలు కలిగినది. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు. CDSL IPF పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్ లో అవగాహన కలిగించటంలోను మరియు మార్కెట్ సంక్లిష్టతలను పరిశోధించుటలోను CDSL IPF కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడిదారులను ఆత్మనిర్భర్ పెట్టుబదిదారునిగా తీర్చిదిద్దుతకు కావలసిన పరిజ్ఞానం మరియు నైపుణ్యాతలను అందించాలనే లక్ష్యంతో CDSL IPF ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు గురించి పరిజ్ఞానం విస్తరింప చేయుటకు కట్టుబడి, CDSL IPF ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించుటకు ఉద్యమిస్తున్నాది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) IPF భారతదేశం అంతటా పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాది. గత ఆర్ధిక సంవత్సరం 2023-24లో CDSL IPF దేశ వ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ మరియు 16 ఇతర ప్రాంతీయ బాషలలో పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలు (IAP) నిర్వహించాతమే కాక సుమారు 1.45 లక్షల మంది పెట్టుబడిదారులకు చక్కని అవగాహన కలిగించి చేరువైనది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ అవగాహన సదస్సులను ప్రాంతీయ బాషలలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియచేసారు.