Latest News
- Vizagvision :
- Vizag Vision : జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్….వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్…కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది.8 మంది సభ్యులతో కమిటీ..కేంద్ర సర్కార్ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్ కోవింద్ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్‌నాథ్ కోవింద్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసి.. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది.ఒకే దేశం ఓకే ఎన్నిక..చరిత్ర ఇలా…ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పుడూ ప్రత్యేకమే. సాధారణంగా భారత్‌లో కేంద్రానికి, రాష్ట్ర అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్‌కు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు. శాసనసభ గడువు ముగిసే ఏడాది మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ కారణంతో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని, ప్రభుత్వ ఖర్చు పెరిగిపోతోందని కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా జమిలీ ఎన్నికలపై ఆలోచిస్తోంది.ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలంపాటు విచారించి14 మార్చి, 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కమిటీ నివేదిక అందించింది. 18 వేల పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్లకు ఒకే ఓటరు జాబితా సిద్ధం చేయాలని నివేదికలో సూచించారు. 2023, సెప్టెంబర్ 2 న ఏర్పాటైన ఈ కమిటీ నివేదికను రూపొందించడానికి 191 రోజులు పట్టింది. సెప్టెంబర్ 18, 2024న కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలు జరపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీకు తెలుసా.. జమిలీ ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. సుమారు 41 ఏళ్ల క్రితమే1983లో జమిలి ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.చరిత్ర ఇదే..1983లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరపాలని ఎన్నికల సంఘం సూచించింది. 1999లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల చట్ట సంస్కరణలపై 170వ నివేదికను సమర్పించింది. 2018లో లా కమిషన్ ఆఫ్ ఇండియా జమిలీ ఎన్నికలపై నివేదిక విడుదల చేసింది. 15 ఆగస్టు, 2019 నాటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దేశమంతటా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు. 1 సెప్టెంబర్, 2023న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’పై కమిటీ ఏర్పాటైంది. 2 సెప్టెంబర్ 2023న కమిటీ సభ్యులను ప్రకటించారు.హోం శాఖ మంత్రి అమిత్ షా సహా ఏడుగురు సభ్యులు ఇందులో ఉన్నారు. వారిలో రామ్‌నాథ్ కోవింద్ కూడా ఒకరు. 23 సెప్టెంబర్ 2023న కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ అంశంపై ముందుగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రోడ్‌మ్యాప్‌కు సంబంధించి లా కమిషన్‌తో చర్చించి ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. మొత్తానికి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని నివేదిక రూపొందించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం కూడా ఓకే చెప్పడంతో.. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయనమాట.
- కూచిపూడి కృత్య ప్రదర్శన Ganesh utsav by Crazy Boys Visakhapatnam Vizagvision
- Devil Tress ఏడాకుల చెట్లే విశాఖ నగర వాసులను భయపెడుతున్నాయి #vizagvision #vizagupdates #shots
- #Live Chief Minister Nara Chandrababu Naidu Media Conference Vizagvision
- Mega Final Vizag School Champions and Mega Dance Visakhapatnam Vizagvision
- Amazon Festive Yatra Box Campaign Launched in Visakhapatnam Vizag Vision
- 4th Vande Bharat Train to Visakhapatnam Introduced Vizagvision
- మిలాద్-ఉన్-నబి విశాఖలో ముస్లింల శాంతి ర్యాలీ ఐక్యమత్యానికి ప్రతీక Vizagvision
- Vizagvision :
Home Devotional VIZAGVISION:Tirupathi | chakra theertham Tirumala | chakra theertham waterfalls | malayappa |చక్రతీర్థం|నాగతీర్థ
VIZAGVISION:Tirupathi | chakra theertham Tirumala | chakra theertham waterfalls | malayappa |చక్రతీర్థం|నాగతీర్థ
VIZAGVISION:Tirupathi | chakra theertham Tirumala | chakra theertham waterfalls | malayappa |చక్రతీర్థం|నాగతీర్థ
Related Articles
-
-
-