HomeUncategorizedVizag vision: మన్మోహన్ సింగ్ మరణానికి డా॥ కూటికుప్పల సంతాపం”ఆర్థిక సంస్కరణల సారథి, ప్రపంచం మెచ్చిన రాజనీతజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, భారత మాజీ ప్రధాని డా॥ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప మేధావిని, ఆర్థికశాస్త్ర నిపుణున్ని కోల్పోయిందని, పద్మశ్రీ పురస్కారగ్రహీత ప్రముఖ వైద్యనిపుణులు, డా॥ కూటికుప్ప సూర్యారావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు.2008లో ఆయన భారత ప్రధానిగా వున్నప్పుడే “చికిత్స పరిశోధనా రంగాల్లో” అతని సమక్షంలో పద్మశ్రీని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గౌ॥ భారత రాష్ట్రపతిగారిచ్చిన నాటి హైటి కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్లో ఆయనతో ముచ్చటించే అవకాశం కలిగింది. ఆ సంధర్భంగా వెనుకబడిన జిల్లాలో చిన్న గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించే వైద్య నిపుణిడిగా అభివృద్ధి అవ్వడం, అందుకు పద్మశ్రీ పురస్కారం రావడం మీ కృషికి నిదర్శనం అని నన్ను అభినందించారు. అటుపైన ఢిల్లీ తీన్ మూర్తి భవన్లో జాతీయ వైద్య ఎక్సలన్సీ అవార్డు ఆయన చేతులమీదుగా అందుకున్నాను. నాడు శ్రీ మన్మోహన్ సింగ్ గార్కి పివి నరసింహరావు గారితో ఆయన కలిసున్న ఛాయాచిత్రాన్ని బహుకరించాను.మృధుస్వభావి, స్ఫురదూపి అయిన ఆ మహనీయునితో గడిపిన మధురక్షణాలు పదే పదే గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రధానిగా దేశంలో తెచ్చిన సంస్కరణల మూలంగా ఈరోజు మన దేశం ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ముదావాహమని ప్రస్తుతిస్తూ డా॥ కూటికుప్పల సూర్యారావు మన్మోహన్సింగ్ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియపరిచారు. దేశం ఎప్పటికీ ఆయన్ని గుర్తుపెట్టుకుంటుందని ఆయన సేవలు చిరస్మరణీయమని దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని డా॥ కూటికుప్పల ఆకాంక్షించారు.
Vizag vision: మన్మోహన్ సింగ్ మరణానికి డా॥ కూటికుప్పల సంతాపం”ఆర్థిక సంస్కరణల సారథి, ప్రపంచం మెచ్చిన రాజనీతజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, భారత మాజీ ప్రధాని డా॥ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప మేధావిని, ఆర్థికశాస్త్ర నిపుణున్ని కోల్పోయిందని, పద్మశ్రీ పురస్కారగ్రహీత ప్రముఖ వైద్యనిపుణులు, డా॥ కూటికుప్ప సూర్యారావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు.2008లో ఆయన భారత ప్రధానిగా వున్నప్పుడే “చికిత్స పరిశోధనా రంగాల్లో” అతని సమక్షంలో పద్మశ్రీని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గౌ॥ భారత రాష్ట్రపతిగారిచ్చిన నాటి హైటి కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్లో ఆయనతో ముచ్చటించే అవకాశం కలిగింది. ఆ సంధర్భంగా వెనుకబడిన జిల్లాలో చిన్న గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించే వైద్య నిపుణిడిగా అభివృద్ధి అవ్వడం, అందుకు పద్మశ్రీ పురస్కారం రావడం మీ కృషికి నిదర్శనం అని నన్ను అభినందించారు. అటుపైన ఢిల్లీ తీన్ మూర్తి భవన్లో జాతీయ వైద్య ఎక్సలన్సీ అవార్డు ఆయన చేతులమీదుగా అందుకున్నాను. నాడు శ్రీ మన్మోహన్ సింగ్ గార్కి పివి నరసింహరావు గారితో ఆయన కలిసున్న ఛాయాచిత్రాన్ని బహుకరించాను.మృధుస్వభావి, స్ఫురదూపి అయిన ఆ మహనీయునితో గడిపిన మధురక్షణాలు పదే పదే గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రధానిగా దేశంలో తెచ్చిన సంస్కరణల మూలంగా ఈరోజు మన దేశం ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ముదావాహమని ప్రస్తుతిస్తూ డా॥ కూటికుప్పల సూర్యారావు మన్మోహన్సింగ్ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియపరిచారు. దేశం ఎప్పటికీ ఆయన్ని గుర్తుపెట్టుకుంటుందని ఆయన సేవలు చిరస్మరణీయమని దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని డా॥ కూటికుప్పల ఆకాంక్షించారు.