ఆర్థరైటిస్ అవగాహన: మెరుగైన రేపటి వైపు అడుగులు

అక్టోబరు 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో చాలా సాధారణమైన ప్పటికీ తరచుగా తప్పుగా అర్థం చేసుకోబ చేసుకోబడే ఆరోగ్య పరిస్థితులలో ఒకటి అయిన ఆర్థరైటిస్ పై ప్రపం చం దృష్టి పడింది. కాకినాడలోని సిద్ధార్థ హాస్పిటల్లో చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆదిత్య కృష్ణ ఈ సందర్భంగా ముందస్తుగా రోగ నిర్ధారణ, అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆర్థరైటిస్‌ను నిర్వహించడంలో అవగాహనతో కూడిన ఎంపికలు, మెరుగైన ఫలితాలు అనేవి ఆర్థరై టిస్తో బాధ పడుతున్న వారి జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో అవగాహన ప్రాముఖ్యతను, చురుకైన చర్యలను చాటిచెబుతాయి.
ఇంతకూ ఆర్థరైటిస్ అంటే ఏమిటి?
ఆర్థరైటిస్ అనేది వృద్ధులను మాత్రమే ప్రభావితం చేసే ఒక పరిస్థితిగా పరిగణించబడుతుంది, అయితే వాస్తవానికి, ఆర్థరైటిస్ అనేది 100కి పైగా వివిధ కీళ్ల-సంబంధిత వ్యాధులకు ఒక గొడుగు పదం. దీని లక్షణాలు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. కొద్దిపాటి అసౌకర్యం మొదలుకొని తీవ్ర వైకల్యం దాకా దీని లక్షణాలుంటాయి. ఆర్థరైటిస్‌లో అత్యంత సాధారణమైన ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్ ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి కూడా దాని కంటూ ప్రత్యేక కారణాలు కలిగిఉంది. అవి శరీరంపై ప్రభావం చూపుతాయి.
ఆస్టియో ఆర్థరైటిస్ ప్రధానంగా కీళ్లు అరిగిపోవడం వల్ల వస్తుంది, ముఖ్యంగా మోకాలు, తుంటి వంటి బరువు మోసే ప్రాంతాలలో. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇక్కడ శరీ శరీరం లోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కీళ్లపై దాడి చేస్తుంది, వాపు, నొప్పికి కారణమవుతుంది. ప్రతి పరిస్థితికి సమర్థవంతంగా చికిత్స చేయడానికి గాను ఈ తేడాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఆర్థరైటిస్ నిర్వహణలో అవగాహనే కీలకం
ఆర్థరైటిస్‌ను నిర్వహించడంలో ప్రధాన సవాళ్లలో ఒకటి, స్టిఫ్ నెస్ (బిగుసుకుపోవడం) లేదా అప్పు డప్పుడు కీళ్ల నొప్పులు వంటి సంకేతాలను ముందుగానే గుర్తించడం. చికిత్స పొందడంలో ఈ ఆలస్యం కాలక్రమేణా మరింత తీవ్రమైన కీళ్ల నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో తేడా కలిగిస్తుంది.
ఈరోజున వ్యాధి పురోగమనాన్ని మందగింపజేసేలా ఔషధాలు, ఫిజికల్ థెరపీ మొదలుకొని జీవన శైలి మార్పుల వరకు అనేక రకాల చికిత్సా ఎంపికలను కలిగి ఉండటం మన అదృష్టం అని చెప్పు కోవచ్చు. అయితే మొదటి అడుగు ఎప్పుడు కూడా మీరు ఏరకమైన ఆర్థరైటిస్ ను కలిగి ఉన్నారో అర్థం చేసుకోవడమే. దాన్ని బట్టే మీ వైద్యులు మీ నిర్దిష్ట అవసరాలకు సరిపోయే చికిత్స ప్రణాళికను రూపొందించి అందిస్తారు.
చికిత్స నమూనాలో మార్పు
గత దశాబ్ది కాలంలో, ఆర్థరైటిస్ చికిత్స తీరుతెన్నులు మారుతూ వచ్చాయి. రోగులు ఇప్పుడు తమ లక్షణాలు, జీవనశైలి, నిర్దిష్ట రకమైన ఆర్థరైటిస్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన చికిత్సను పొందే వీలుంది. ఈ పురోగతులన్నీ కూడా మెరుగైన ఫలితాలకు దారితీశాయి. దాంతో మరీ ముఖ్యంగా మెరుగైన నాణ్యత కలిగిన జీవనాన్ని గడపడం సాధ్యపడింది. ఉదాహరణకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ చికిత్స లో టార్గెటెడ్ బయోలాజిక్ థెరపీలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ఈ మందులు సంప్రదాయిక చికిత్సల కంటే కూడా వ్యాధిని మరింత ప్రభావవంతంగా నియంత్రించడంలో సహాయ పడతాయి. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలతో సహా మెరుగైన శస్త్రచికిత్సా పద్ధతులు, కదలికను పునరుద్ధరిస్తాయి. వ్యాధి ముదిరిపోయిన సందర్భాల్లో నొప్పి నుండి ఉపశమనం అందిస్తాయి.నియంత్రణ తీసుకోవడం: జీవనశైలి ఎంపికలు ముఖ్యమైనవి
వైద్యపరమైన పురోగతులు కీలకమైనప్పటికీ, ఆర్థరైటిస్ నిర్వహణ కూడా వ్యక్తులు ప్రతిరోజూ చేసు కునే ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ జీవనశైలి మార్పులు ఆర్థరైటిస్ పురోగతిని నెమ్మ దింపజేస్తాయి, దానితో జీవించగలిగేలా చేస్తాయి.
చురుగ్గా ఉండటం: నడక, ఈత లేదా యోగా వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు కీళ్లపై భారం వేయకుండానే కీళ్ల సరళత్వాన్ని నిర్వహించడంలో తోడ్పడుతాయి. కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడం అనేది అదనపు మద్దతును అందిస్తుంది. ప్రభావిత ప్రాంతాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
స్మార్ట్ గా తినడం: వాపు నిర్వహణలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, నట్స్ లాంటి ఆహారాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తాజా పండ్లు, కూరగాయలు లాంటివి ముఖ్యంగా కీళ్లను రక్షించే యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. అదనపు బరువు ఇప్పటికే భారంగా ఉన్న కీళ్లకు ఒత్తిడిని జోడిస్తుంది. అందువల్ల ఆరోగ్యదాయక బరువును నిర్వహించడం అనేది ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి చాలా ముఖ్యమైంది.
మనస్సు ప్రధానం: తీవ్రమైన నొప్పితో జీవించడం అనేది మానసికంగా, శారీరకంగా చాలా బాధపెడు తుంది. మైండుల్నెస్ మరియు మెడిటేషన్ వంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్‌లు భావోద్వేగపర మైన భారాన్ని తగ్గించడంలో తోడ్పడుతాయి. నొప్పి భావనను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ నిర్వహణలో సానుకూల దృక్పథం అనేది ఎంతో ముఖ్యమైంది.
మార్పు కోసం ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఆర్థరైటిస్ సంరక్షణను మెరుగుపరచడానికి ఇంకా పని చేయాల్సి ఉందనే అం శాన్ని ప్రపంచ ఆర్థరైటిస్ డే గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణాలలో ఆర్థ రైటిస్ ఒకటిగా మిగిలిపోయింది. లక్షలాది మంది ప్రజలు నొప్పితో, చలనశీలతను కోల్పోవడం కోల్పో వడం వల్ల బాధపడుతున్నారు. అవగాహన పెంచడం వల్ల ప్రజలకు అర్థం చేయించడమే కాకుండా పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలను చైతన్యపరచాలని కూడా మేం ఆశిస్తున్నాం.
ఈ ప్రయాణంలో కమ్యూనిటీ సపోర్ట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థరైటిస్‌తో జీవిస్తున్న వారికి, సపోర్ట్ గ్రూపులు, విద్యా వనరులు అనేవి ఆయా వ్యక్తులు తమ పోరాటంలో ఒంటరిగా లేరని మరియు ముందుకు వెళ్ళే మార్గం ఉందని వారికి గుర్తు చేస్తాయి. అవగాహనతో కూడిన ఎంపికల ద్వారా మెరుగైన ఫలితాలకు దారితీసేదే ఆ మార్గం.
చర్యకు పిలుపు
ప్రపంచ కీళ్లనొప్పుల దినోత్సవం 2024ని నిర్వహించుకున్న సందర్భంలో మనం గణాంకాలు, వైద్యపరమైన నిర్వచనాలపైనే దృష్టి పెట్టకూడదు. ఆర్థరైటిస్ అనేది కీళ్లను ప్రభావితం చేసే వ్యాధి కంటే ఎక్కువ అనే అంశాన్ని గుర్తు చేసేదిగా ఈ రోజును ఉండనిద్దాం. ఈ వ్యాధి ఒక వ్యక్తి జీవితం లోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. అవగాహనతో కూడిన ఎంపికలు, మెరుగైన ఫలితాలు అనేవి మనందరినీ నియంత్రించడానికి, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రభావితమైన వారికి మద్దతు ఇవ్వడానికి ప్రోత్సహిస్తాయి.
వీలైనంత త్వరగా రోగనిర్ధారణ, సమర్థవంతమైన చికిత్సలు, ఆరోగ్యకరమైన జీవనశైలి
















