జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కారకు కృషి….వినాయకచవితి వేడుకలకు ఏర్పాట్లు….
జర్నలిస్టుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అన్నివిధాలా పోరాడుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం శాఖ, అనుబంధసంఘాలు బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్,స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కార్యవర్గ సభ్యుల సమావేశం మంగళవారం ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పీ నారాయణ్ లు కార్యవర్గ సభ్యులకు యూనియన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసారు. యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శుక్రవారం సభ్యులకు వినాయక ప్రతిమలు,మొక్కలు,చవితి కధాపుస్తకం పంపిణీ చెయ్యాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.సభ్యులందరికీ యూనియన్ అన్నివిధాలా అండగా ఉంటుందని, జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉందని తెలిపారు.ఈ సమావేశంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు,ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ఎస్. ప్రసాద్,ఉపాధ్యక్షులు కె మురళీకృష్ణ,బీ శివప్రసాద్,బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీ ఎస్ జగన్మోహన్,కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు