వి.వి.గిరి కి గౌరవ డాక్టరేట్
విశ్వనాధ వెంకట గిరి గారికి సామాజిక సేవా రంగం లో గత 35 సంవత్సరాలుగా వివిధ హోదాలలో చేస్తున్న సేవకు గుర్తింపుగా ముంబై లోని కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఆగస్టు 31వ తారీఖున ముంబై నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో సత్కరించారు. విశాఖపట్నం నగరానికి చెందిన డాక్టర్ వి.వి.గిరి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా, రోటరీ క్లబ్, మానవ హక్కుల సంఘం ద్వారా అనేకానేక సేవా కార్యక్రమాలలో పాల్గొని సమాజానికి తనవంతుగా ఇతోధిక సేవ చేస్తున్నారు. వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతల మీద అనేక అవగాహనా సదస్సుల లో పాల్గొని, వినియోగదారులను జాగృతం చేయడం డాక్టర్ వి.వి.గిరి పాత్ర శ్లాఘించదగినది. అంతే కాకుండా, తన దగ్గరకి సహాయం కోసం వచ్చిన వారికి గాని అలాగే ఎవరికైనా సహాయం కావాలని తెలుసుకొనిన మరు క్షణం తన పర బేధం లేకుండా సహాయం చేయుటకు ముందుండే మనస్తత్వం డాక్టర్ గిరి స్వంతం. ఎందరెందరికో తన వంతు సహాయం చేస్తూ మన్ననలు పొందారు.