విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారులు నిరసనకు దిగారు. 20 ఏళ్ల క్రితం విశాఖ కంటైనర్ టెర్మినలు భూములిచ్చిన సమయంలో 60 గజాల ఇంటి స్థలం, రూ. లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు పరచలేదని మరో మారు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కంటైనర్ టెర్మినల్‌కు వెళ్లే మార్గంలో భారీగా మత్స్యకారులు నిరసన తెలుపుతున్నారు
















