ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరగబోవు వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ ట్రోఫీ ను ఆదివారం నాడు మేఘాలయ హోటల్ నందు జరిగిన కార్యక్రమం లో రాజ్య సభ సభ్యులు జి వి ఎల్ నరసింహం గారు సౌత్ ఇండియా వాడొకై కరాటే అసోసియేషన్ చైర్మన్ సుమన్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీ వీ ఎల్ నరసింహారావు మాట్లాడుతూ నేటి సమాజంలో చదువు తో పాటు క్రీడలు ఎంతో అవసరం అన్నారు. ముఖ్యంగా మహిళలు యొక్క ఆత్మరక్షణ కు తల్లి తండ్రులు ఇలాంటి క్రీడలు ను ప్రోత్సహించాలి , కేంద్ర ప్రభుత్వం కూడా మన దేశంలో క్రీడా అభివృద్ధి కృషి చేస్తుంది అన్నారు. ఈ యొక్క పోటీలు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం లో జరగనున్నాయి . అని చీఫ్ ఆర్గనైజర్ చిగురుపల్లి సతీష్ కుమార్ గారు తెలియజేసారు . ఈ యొక్క కార్యక్రమం లో బొడ్డేపల్లి రఘు గారు , కరణం రెడ్డి నరసింగ రావు గారు, జి వి ఎం సి అడిషనల్ కమీషనర్ యాదగిరి శ్రీనివాస రావు గారు పాల్గొన్నారు.
















