HomeUncategorizedVizagvision విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవింద్ జన్మదిన వేడుకలు అభిమానులు,వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తల సందడి మధ్య ఘనంగా నిర్వహించారు.గురువారం స్థానిక హోటల్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు పార్టీలకతీతంగా పలువురు నాయకులు,కార్యకర్తలు హాజరై బొకేలతో,పూలమాలలతో, శాలువాలతో సత్కరించి గోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులు,వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు,అభిమానుల కేరింతల మధ్య గోవింద్ కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా హాజరైన పలువురు నాయకులు మాట్లాడుతూ గోవింద్ రాజకీయ భవిష్యత్తు మరింత దేదీప్యమానంగా వెలుగొందాలని ఆకాంక్షించారు.అనంతరం పేదమహిళలకు చీరలు,పళ్ళు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ తమ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా చేసేంతవరకు అలుపెరుగని పోరాటం చేస్తానని ప్రకటించారు.విశాఖలో పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులకు,నాయకులకు,కార్యకర్తలు,అభిమానులకు గోవింద్ ధన్యవాదాలు చెప్పారు.
Vizagvision విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవింద్ జన్మదిన వేడుకలు అభిమానులు,వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తల సందడి మధ్య ఘనంగా నిర్వహించారు.గురువారం స్థానిక హోటల్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు పార్టీలకతీతంగా పలువురు నాయకులు,కార్యకర్తలు హాజరై బొకేలతో,పూలమాలలతో, శాలువాలతో సత్కరించి గోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులు,వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు,అభిమానుల కేరింతల మధ్య గోవింద్ కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా హాజరైన పలువురు నాయకులు మాట్లాడుతూ గోవింద్ రాజకీయ భవిష్యత్తు మరింత దేదీప్యమానంగా వెలుగొందాలని ఆకాంక్షించారు.అనంతరం పేదమహిళలకు చీరలు,పళ్ళు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ తమ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా చేసేంతవరకు అలుపెరుగని పోరాటం చేస్తానని ప్రకటించారు.విశాఖలో పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులకు,నాయకులకు,కార్యకర్తలు,అభిమానులకు గోవింద్ ధన్యవాదాలు చెప్పారు.