HomeUncategorizedVizagvision Visakhapatnam:తొలి రోజు జాబ్ మేళా మెగా సక్సస్ 13663 మందికి ఉద్యోగాలు అత్యధికంగా రూ.12 లక్షలు వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసిన ముంబైకి చెందిన హ్యాపీయస్ట్ మైండ్స్ సంస్థ తరువాత స్థానంలో 10 లక్షల వార్షిక వేతనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన వైఎస్సార్ మెగా జాబ్ మేళా మెదటిరోజు మెగా సక్సస్ సాధించింది. ఏకంగా 13,663 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు లభించడంతో ప్రారంభమై మొదటి రోజే రికార్డు సృష్టించింది. ఈ మేరకు ఆంధ్ర యూనివర్శిటీ స్నాతకోత్సవ మందిరంలో శనివారం సాయంత్రం ఎంపికైన అభ్యర్దులకు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. విజయసాయి రెడ్డి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్బంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళా ప్రారంభించిన తొలి రోజే రికార్డు స్థాయిలో విజయం సాధించిందని అన్నారు. గత రెండు సంవత్సరాలలో కోవిడ్ ప్రభావంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారని, మరెంతో మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని, అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ కుంటుపడిందని అన్నారు. కోవిడ్ నుండి ఇప్పడిప్పుడే పుంజుకొని దేశం, రాష్ట్రం ప్రగతిపధంలో నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ సామాజిక బాధ్యతగా తీసుకొని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జాబ్ మేళాలు నిర్వహిస్తోందని అన్నారు. విశాఖ జాబ్ మేళాకు మొత్తం 77 వేల మంది ఉద్యోగార్థులు రిజిస్టర్ చేసుకున్నారని అందులో మొదటి రోజు జరిగిన ఎంపిక ప్రక్రియ ద్వారా 13,663 మంది ఉద్యోగాలు పొందటం, ప్రఖ్యాతి చెందిన పలు ఐటీ కంపెనీలకు 782 మంది ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ముంబైకి చెందిన హ్యాపీయెస్ట్ మైండ్స్ సంస్థ శ్రీనివాస్ అనే యువకుడికి అత్యధికంగా రూ.12 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపిక చేసిందని, హెచ్.సి.ఎల్ కంపెనీ రూ.10 లక్షల వార్షిక ప్యాకేజీతో పలువురిని ఎంపిక చేసిందని తెలిపారు. కేంద్రం అధికారిక లెక్కలు ప్రకారం నిరుద్యోగ సూచికలో మెదటి 13 స్థానాలలో ఆంధ్రప్రదేశ్ లేదని, ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం కేవలం 5.4% మాత్రమే ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయని, ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోని వారు ఎక్కువ మందే ఉంటారని అన్నారు. రెండు రోజుల పాటు ఈ జాబ్ మేళా నిర్వహించాలని మొదట తలపెట్టినా రిజిష్టర్ చేసుకున్న ఉద్యోగార్థులు 70 వేల మంది ఉన్నందున మూడో రోజుకు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాబ్ మేళాలో దివ్యాంగులకు, అనాధ శరణాలయంలో చదువుకుంటున్న యువతకు ఉద్యోగాలు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పచ్చ బ్యాచ్ నోటికి తాళం వైఎస్సార్ మెగా జాబ్ మేళా నిర్వహించిన మెదటి రోజే పెద్ద ఎత్తున విజయం సాధించడంతో జాబ్ మేళాపై అవాకులు, చెవాకులు పేలిన టీడీపీ నాయకుల నోళ్లు మూతపడ్డాయని, ఈ జాబ్ మేళా మెగా సక్సస్ వారి విమర్శలకు చెంపపెట్టుగా నిలిచాయన్నారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని, తమ ఉనికి కాపాడుకోవడానికి అర్దంలేని విమర్శలు చేయకూడదని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ఉద్యోగాలని అవహేళన చేసిన పచ్చ బ్యాచ్ లక్షల జీతాలతో జాబ్ మేళాలో ఎంపికైన యువతను చూడాలని అన్నారు. మద్యం సేవించి మాట్లాడుతున్నారని, టీడీపి నాయకుడు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యన్నారాయణ, అతని కుమారుడు అప్పల నాయుడు భూమికి భారమని, వారికి బ్రతకడానికి అర్హత లేదని అన్నారు. కార్యక్రమాన్ని పెద్దఎత్తున విజయవంతం చేసిన ఏయు వీసీ ప్రసాద్ రెడ్డి, మిలీనియం శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ, పోలీస్, జివిఎంసి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంపికైన అభ్యర్దులకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Vizagvision Visakhapatnam:తొలి రోజు జాబ్ మేళా మెగా సక్సస్ 13663 మందికి ఉద్యోగాలు అత్యధికంగా రూ.12 లక్షలు వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసిన ముంబైకి చెందిన హ్యాపీయస్ట్ మైండ్స్ సంస్థ తరువాత స్థానంలో 10 లక్షల వార్షిక వేతనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన వైఎస్సార్ మెగా జాబ్ మేళా మెదటిరోజు మెగా సక్సస్ సాధించింది. ఏకంగా 13,663 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు లభించడంతో ప్రారంభమై మొదటి రోజే రికార్డు సృష్టించింది. ఈ మేరకు ఆంధ్ర యూనివర్శిటీ స్నాతకోత్సవ మందిరంలో శనివారం సాయంత్రం ఎంపికైన అభ్యర్దులకు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. విజయసాయి రెడ్డి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్బంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళా ప్రారంభించిన తొలి రోజే రికార్డు స్థాయిలో విజయం సాధించిందని అన్నారు. గత రెండు సంవత్సరాలలో కోవిడ్ ప్రభావంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారని, మరెంతో మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని, అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ కుంటుపడిందని అన్నారు. కోవిడ్ నుండి ఇప్పడిప్పుడే పుంజుకొని దేశం, రాష్ట్రం ప్రగతిపధంలో నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ సామాజిక బాధ్యతగా తీసుకొని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జాబ్ మేళాలు నిర్వహిస్తోందని అన్నారు. విశాఖ జాబ్ మేళాకు మొత్తం 77 వేల మంది ఉద్యోగార్థులు రిజిస్టర్ చేసుకున్నారని అందులో మొదటి రోజు జరిగిన ఎంపిక ప్రక్రియ ద్వారా 13,663 మంది ఉద్యోగాలు పొందటం, ప్రఖ్యాతి చెందిన పలు ఐటీ కంపెనీలకు 782 మంది ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ముంబైకి చెందిన హ్యాపీయెస్ట్ మైండ్స్ సంస్థ శ్రీనివాస్ అనే యువకుడికి అత్యధికంగా రూ.12 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపిక చేసిందని, హెచ్.సి.ఎల్ కంపెనీ రూ.10 లక్షల వార్షిక ప్యాకేజీతో పలువురిని ఎంపిక చేసిందని తెలిపారు. కేంద్రం అధికారిక లెక్కలు ప్రకారం నిరుద్యోగ సూచికలో మెదటి 13 స్థానాలలో ఆంధ్రప్రదేశ్ లేదని, ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం కేవలం 5.4% మాత్రమే ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయని, ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోని వారు ఎక్కువ మందే ఉంటారని అన్నారు. రెండు రోజుల పాటు ఈ జాబ్ మేళా నిర్వహించాలని మొదట తలపెట్టినా రిజిష్టర్ చేసుకున్న ఉద్యోగార్థులు 70 వేల మంది ఉన్నందున మూడో రోజుకు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాబ్ మేళాలో దివ్యాంగులకు, అనాధ శరణాలయంలో చదువుకుంటున్న యువతకు ఉద్యోగాలు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పచ్చ బ్యాచ్ నోటికి తాళం వైఎస్సార్ మెగా జాబ్ మేళా నిర్వహించిన మెదటి రోజే పెద్ద ఎత్తున విజయం సాధించడంతో జాబ్ మేళాపై అవాకులు, చెవాకులు పేలిన టీడీపీ నాయకుల నోళ్లు మూతపడ్డాయని, ఈ జాబ్ మేళా మెగా సక్సస్ వారి విమర్శలకు చెంపపెట్టుగా నిలిచాయన్నారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని, తమ ఉనికి కాపాడుకోవడానికి అర్దంలేని విమర్శలు చేయకూడదని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ఉద్యోగాలని అవహేళన చేసిన పచ్చ బ్యాచ్ లక్షల జీతాలతో జాబ్ మేళాలో ఎంపికైన యువతను చూడాలని అన్నారు. మద్యం సేవించి మాట్లాడుతున్నారని, టీడీపి నాయకుడు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యన్నారాయణ, అతని కుమారుడు అప్పల నాయుడు భూమికి భారమని, వారికి బ్రతకడానికి అర్హత లేదని అన్నారు. కార్యక్రమాన్ని పెద్దఎత్తున విజయవంతం చేసిన ఏయు వీసీ ప్రసాద్ రెడ్డి, మిలీనియం శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ, పోలీస్, జివిఎంసి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంపికైన అభ్యర్దులకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.