సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించిన మంత్రి కే.టి.ఆర్.

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కమిటి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల ప్రతినిధులు, అమెజాన్,ఎస్.బి.ఐ మరియు పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
కామర్స్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కే.టి.ఆర్ ప్రసంగించారు. భారతదేశంలో ఈ కామర్స్ నియంత్రణ, ప్రమోషన్స్ తదితర విషయాల గూర్చి వివరించారు. రానున్న 5-10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇ-కామర్స్ అభివృద్ధికి చేపట్టనున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ విజన్ పై మంత్రి కే.టి.ఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

















