Minister Ambati Rambabu Press Meet Vizagvision పోలవరంపై విషం చిమ్ముతున్న ఈనాడు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్చు పరిస్థితిపై సవివరంగా మాట్లాడాలనుకున్నాను. కానీ, ఈనాడు, దానికితోడు ఎల్లో మీడియాకు చెందిన కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు.. సందు దొరికినా, దొరకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి మీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే, ఇవాళ ఈనాడు దినపత్రిక పోలవరం పునరావాసం రెండు ముక్కలు.. అంటూ పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. అంతేకాకుండా పురగోతి 1.46 శాతం మాత్రమేనని, ఇసుక కోతకు, గుంతలు పూడ్చేందుకు, డ్రెజ్జింగ్ పరిష్కారంగా 800 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఈనాడు పత్రిక పెద్ద బ్యానర్ వార్తను వ్యంగ్యంగా రాసింది. పోలవరం ప్రాజెక్ట్ పై విషం చిమ్మి, ప్రజల్లో ఒక గందరగోళం కల్పించే ప్రయత్నం ఈనాడు చేస్తుంది. విషం ఒక్కసారిగా ఎక్కించరు. స్లో పాయిజన్‌లా వార్తలు రాసి పోలవరం విషయంలో జగన్‌గారు, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలు చేస్తుందనే ఒక భావన ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.అదే చంద్రబాబు నాయుడుగారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం శరవేగంతో పోలవరం, ఒక్కరోజులోనే అద్భుతమైనటువంటి వేల లక్షల అడుగులు కాంక్రీటు వేసేశారంటూ వార్తలు రాశారు. వాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారు నిత్యం ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టుకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి, ఇంకా సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరంపై బురదచల్లే ప్రయత్నాలు చేయవద్దని, వాటిని మానండని ముఖ్యమంత్రిగారు ఇటీవల శాసనసభలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తి చేస్తారు ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినా కొన్ని దశలలో పూర్తి చేస్తారు. ఒక్కసారిగా ఏ ప్రాజెక్ట్ పూర్తికాదు. అలా చేస్తే ప్రమాదం కూడా. ఇదేదో నేను చెబుతున్న మాట కాదు. చరిత్ర చెబుతున్న సత్యం. అనేక ప్రాజెక్టుల నిర్మాణం తీసుకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టులు దశలవారీగానే జరిగాయి. ఒక్కసారే ప్రాజెక్ట్‌ను నింపేస్తే ప్రమాదం జరుగుతుంది. దానికి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. కాబట్టి దశలవారీగా ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ) కూడా కలిసి ఒక నిర్ణయం ప్రకారం ప్రాజెక్టు పనులను చేస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వారు డ్యాం సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. #Vizagvision For Inquiries Please WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com And Also Follow Us On : vizagvision Groups Website: http://www.vizagvision.com/ Facebookpage: https://www.facebook.com/vizagvision Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision Please Subscribe My Channel Please Follow This Links Don’t For Got Please Support Me Friends Vizagvision is Political Affairs,Fun, Entertainment, Share Video Clips, Political News,Tourism etc.. All Videos we Presenting in a Short Format. If you want to get all these videos in Vizagvision. For Watch videos,political affairs,Tourism,Entertainment subscribe to my channel. https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
















