HomeUncategorizedVizagvision Visakhapatnam : బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఓరుగంటి సీతారామమూర్తి మృతి తీరని లోటని అయనతో పనిచేసినసహోపాధ్యాయులు,శిష్యులు,అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.విజ్ఞాన భారతి ప్రధానోపాధ్యాయునిగా,రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తగా సేవలందించి ఇటీవల మృతిచెందిన డాక్టర్ ఓరుగంటి సీతారామమూర్తి సంస్మరణ సభ బుధవారం ద్వారకానగర్ బివీకే కాలేజీ ప్రాగణంలో బీవీక్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శిష్యులు,అభిమానులు,మిత్రులు,సహచరుల నడుమ నిర్వహించారు.భారతీయ విద్యాకేంద్రం అధ్యక్షుడు ఆచార్య పీ ఎస్ అవధాని ఆర్ ఎస్ ఎస్ మహానగర సంఘ చాలక్ పీ.నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ విద్యాభారతి అధ్యక్షుడు జీ.నాగేశ్వరరావు అధికసంఖ్యలో అభిమానులు,శిష్యులు,సహచరులు హాజరై అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయనతో గల అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు. సంస్కృతీబోధ పరియోజన విషయములో చాలా కృషిచేసి అన్ని వర్గలలో నిర్వహణ చేస్తూ ప్రాంత, క్షేత్ర, అఖిలభారత స్థాయిలలో విద్యార్థులతో కలిసి అయన పర్యటనలు చేసేవారని స్మరించుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షణ పూర్తిచేసుకుని సంఘ శిక్షణ కేంద్రాలలో బౌద్దిక్ ప్రముఖ, సర్న ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహించేవరని గుర్తుచేశారు.విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యునిగా అయన సేవలు మరువలేనివన్నారు.. భారతీయ విద్యా కేంద్ర పాలక వర్గ సభ్యునిగా సేవలందించి బీవీకే కళాశాలల అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారని ప్రశంసించారు.విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ సంస్కృతీబోధ పరియోజన ప్రముఖ్ గా సేవలందిస్తూ, హిందీ పాఠ్య పుస్తక రచనా విభాగంలో ఎడిటర్ గా బాధ్యత నిర్వహించారని సహచరులు తెలిపారు.దిలీప్ బేత్కకర్ వ్రాసిన “హమ్ సరస్వతీ పుత్ర” హిందీ పుస్తకాన్ని “మనం సరస్వతీ పుత్రులం” పేరిట తెలుగులోనికి అనువదించి తెలుగు పాఠకులకు మరపురాని అనుభూతి మిగిల్చారన్నారు.ఎక్కడ పనిచేసినా అందరితో మమేకమై ఎన్నోవిషయాలు భోదించేవారన్నారు. పూర్వ విద్యార్థులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని తమ తమ అభిప్రాయాలకు వక్తలతో పంచుకున్నారు.సంస్మరణ సభలో పాల్గొన్న ఓరుగంటి సీతారామమూర్తి కుమారుడు అజయ్,కుమార్తె వందనలను పలువురు పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
Vizagvision Visakhapatnam : బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఓరుగంటి సీతారామమూర్తి మృతి తీరని లోటని అయనతో పనిచేసినసహోపాధ్యాయులు,శిష్యులు,అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.విజ్ఞాన భారతి ప్రధానోపాధ్యాయునిగా,రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తగా సేవలందించి ఇటీవల మృతిచెందిన డాక్టర్ ఓరుగంటి సీతారామమూర్తి సంస్మరణ సభ బుధవారం ద్వారకానగర్ బివీకే కాలేజీ ప్రాగణంలో బీవీక్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శిష్యులు,అభిమానులు,మిత్రులు,సహచరుల నడుమ నిర్వహించారు.భారతీయ విద్యాకేంద్రం అధ్యక్షుడు ఆచార్య పీ ఎస్ అవధాని ఆర్ ఎస్ ఎస్ మహానగర సంఘ చాలక్ పీ.నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ విద్యాభారతి అధ్యక్షుడు జీ.నాగేశ్వరరావు అధికసంఖ్యలో అభిమానులు,శిష్యులు,సహచరులు హాజరై అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయనతో గల అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు. సంస్కృతీబోధ పరియోజన విషయములో చాలా కృషిచేసి అన్ని వర్గలలో నిర్వహణ చేస్తూ ప్రాంత, క్షేత్ర, అఖిలభారత స్థాయిలలో విద్యార్థులతో కలిసి అయన పర్యటనలు చేసేవారని స్మరించుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షణ పూర్తిచేసుకుని సంఘ శిక్షణ కేంద్రాలలో బౌద్దిక్ ప్రముఖ, సర్న ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహించేవరని గుర్తుచేశారు.విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యునిగా అయన సేవలు మరువలేనివన్నారు.. భారతీయ విద్యా కేంద్ర పాలక వర్గ సభ్యునిగా సేవలందించి బీవీకే కళాశాలల అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారని ప్రశంసించారు.విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ సంస్కృతీబోధ పరియోజన ప్రముఖ్ గా సేవలందిస్తూ, హిందీ పాఠ్య పుస్తక రచనా విభాగంలో ఎడిటర్ గా బాధ్యత నిర్వహించారని సహచరులు తెలిపారు.దిలీప్ బేత్కకర్ వ్రాసిన “హమ్ సరస్వతీ పుత్ర” హిందీ పుస్తకాన్ని “మనం సరస్వతీ పుత్రులం” పేరిట తెలుగులోనికి అనువదించి తెలుగు పాఠకులకు మరపురాని అనుభూతి మిగిల్చారన్నారు.ఎక్కడ పనిచేసినా అందరితో మమేకమై ఎన్నోవిషయాలు భోదించేవారన్నారు. పూర్వ విద్యార్థులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని తమ తమ అభిప్రాయాలకు వక్తలతో పంచుకున్నారు.సంస్మరణ సభలో పాల్గొన్న ఓరుగంటి సీతారామమూర్తి కుమారుడు అజయ్,కుమార్తె వందనలను పలువురు పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.