అప్పనపల్లి | శ్రీ బాల బాలాజీ క్షేత్రం | Appanapalli Temple History | East Godavari District | Vizagvision అప్పనపల్లి, తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామం.. ఇక్కడ రెండు వెంకటేశ్వర దేవస్థానాలు ఉన్నాయి. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశములోలా బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన కీర్తి శేషులు శ్రీమతి వాయువేగుల శీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేయ సాగెను. ఒకనాడు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరి కాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరు నామాలను కనుగొన్నారు. ఆ కొబ్బరి కాయను ప్రతిష్ఠించి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించ సాగెను. అది దిన దిన ప్రవర్ధమానమయి పెద్ద పవిత్ర క్షేత్రమయినది.ఇక్కడ దేవాలయములో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి, కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి రావటం జరిగింది. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చినవి. విచిత్రముగా ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదేచెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నదని, దానినే ధ్వజస్తంభ నిర్మాణమునకు వాడారనీ చెపుతారు. పాత దేవాలయం: ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి. #Vizagvision #AppanapalliTempleHistory VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Please Subscribe My Channel Please Follow This Links Don’t For Got Me Please Support Me Friends Instagram: https://www.instagram.com/vizagvision/