ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ను ప్రయివేటు పరం చేసేందుకు GIBNA చట్ట సవరణ బిల్లును ఏకపక్షంగా లోక్ సభలో ఆమోదించారు.అలాగే సాధారణ బీమా కంపెనీల ఉద్యోగులకు 1.8.2017నుండీ ఇవ్వాల్సిన వేతన సవరణ అమలు జరపడం లేదు.ఇంతవరకు ఒక్క శాతం వేతన పెంపునీ ప్రతిపాదించలేదు.ఇది అత్యంత అన్యాయం
దీనికి నిరసనగా ఈరోజు ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు చేస్తున్న ఒకరోజు సమ్మె కు మద్దతుగా సౌత్ సెంట్రల్ జోన్ లోని అన్ని ఎల్. ఐ. సి కార్యాలయాల ఎదుట భోజన విరామ ప్రదర్శన లు విజయవంతం గా జరిగాయి.

వైజాగ్ డివిజనల్ కార్యాలయం ఎదుట జరిగిన ప్రదర్శనకు ప్రధాన కార్యదర్శి రమణాచలం,అధ్యక్షులు కామేశ్వరి ,రాజమండ్రి లో జరిగిన ప్రదర్శన కు జోనల్ ఉపాధ్యక్షుడు సతీష్ ,బెనర్జీ ,కడపలో జరిగిన ప్రదర్శన కు జోనల్ సంయుక్త కార్యదర్శి కిశోర్ కుమార్,రఘునాథరెడ్డి ,శ్రీనివాస్ లు నాయకత్వం వహించారు.















