అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యములో జున్ 28 వ తేదీ నుంచి నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణి కార్యక్రమము విశాఖ మహానగరంలో పేదలకు , రోజూవారికూలీలు , పారిశుధ్య కార్మికులు , సచివాలయం వాలంటీర్స్ కు నగరములో కష్టకాలంలో తమవంతు సాయముగా దాతల సహకారముతో పంపిణి చేయడం జరుగుతుంది .
దీనిలో భాగముగా ఈ రోజు నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణి కార్యక్రమము శాంతి నగర్, NAD జంక్షన్, 52 వ వార్డులో జియ్యాని శ్రీధర్ గారు (డిప్యూటీ మేయర్, విశాఖ మహానగర పాలక సంస్థ) వారి చేతుల మీదుగా 300 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది .

ఈ కార్యక్రమములో అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు శ్రీ శ్యామ మాధవ దాస గారు మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ దేశవ్యాప్తంగా కరోనా కష్ట కాలములో దాతల సహకారముతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు 300 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపినారు.
నేటితో విశాఖమహానగరములో వివిధ ప్రదేశాలలో 14000 నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణి చేయడం జరిగింది .
నిత్యావసర సరుకుల కిట్ లో వుండు సరుకులు
- బియ్యము 5 కేజీలు
2.కందిపప్పు 1.5 కేజీలు
3.పంచదార 1 కేజీ - గోధుమపిండి 1 కేజీ
5.కొమ్ము శనగలు 1 కేజీ
6.పసుపు 200 గ్రాములు
7.సాంబార్ పొడి 200 గ్రాములు
8.వంటనూనె 1 లీటర్
దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 8184887108, 9010611108
కోవిద్ వ్యాప్తి జరుగుతున్న ఈ తరుణములు భోజనము అవసరము వున్నా వారి కొరకు అక్షయ పాత్ర వారు మేము వున్నాము అని నగరములో 25 భోజన పంపిణి కేంద్రాలను ప్రారంభిచడం జరిగింది . ఈ కేంద్రాలద్వారా 12 వ తేదీ ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు 6 లక్షల పైచిలుకు భోజనములు పంపిణి చేయడం జరుగుతుంది . ఈ కార్యక్రమమును దాతల సహకారముతో ఆగస్టు 30, 2021 వరకు కొనసాగిచడం జరుగుతుంది .
ఈ కార్యక్రము కొరకు సహకరించిన దాతలకు మరియు పంపిణి కార్యక్రమములో సహాయ సహకారములు అందించుచున్న జీవీఎంసీ అధికారులకు డాక్టర్ నిష్క్రించిన భక్తదాస ప్రెసిడెంట్ అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ధన్యవాదములు తెలిపినారు















