దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు పట్టువస్త్రాలను సమర్పించిన భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల Vijayawada Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు పట్టువస్త్రాలను సమర్పించిన శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల Vijayawada
-
Previous
Vizagvision:జాబ్‌క్యాలెండర్ విడుదల చేయమంటే విద్యార్ధి, యువజన సంఘాల నాయకులను గృహనిర్భంధించడాన్ని సిపిఎం ఖండన తక్షణమే 2.30లక్షలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. అక్రమంగా అరెస్టు చేసిన వారినివిడుదలచేయాలి.వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారానికి రాకముందు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల 30వేల పోస్టులను భర్తీచేస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం మూడేళ్ళకు 10వేల పోస్టులకే జాబ్‌క్యాలెండర్ విడుదలచేసింది. మూడేళ్ళ జాబ్‌క్యాలెండర్‌లో నిరుద్యోగులకు నిరాశమిగిల్చారు. ఇందులో గ్రూపు 1, 2 పోస్టులు 36, పోలీస్ శాఖకు సంబంధించిన పోస్టులు 450 మాత్రమే ఉన్నాయి. ఉపాధ్యాయపోస్టులు అసలు ఊసే లేదు. దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సుమారు 6లక్షల మంది నిరుద్యోగులు అప్పులుచేసి పోటీపరీక్షలకు ప్రిపేరు అవుతున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30లక్షల ఉద్యోగాలకు, జిల్లాల్లో ఖాళీగా ఉన్న 77వేల పోస్టులు, రెండేళ్ళ డిఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని గత నెలరోజుల నుండి నిరుద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇది న్యాయమైన పోరాటం. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇప్పటికే తెలియజేసింది.
నేడు మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో ప్రెస్‌మీట్ జరిగింది. ఈ ప్రెస్మీట్లో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.జగన్, వి.కృష్ణారావులున్నారు.
ఈ నెల 19వ తేదీన ఛలో సిఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్ళడానికి విద్యార్ధి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. దీనిని విజయవంతం కాకుండా రాష్ట్ర వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నాయకులను గత రెండు రోజుల నుండి వారి ఇళ్ళవద్దకు పంపి గృహనిర్భంధాన్ని ప్రయోగించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎస్ఎప్ఐ నగర అధ్యక్షరాలు కుసుమ, రాష్ట్ర నాయకురాలు ఎల్.చిన్నారి ఇంటికి మగపోలీసులను, వైసిపి కార్యకర్తలను పంపి భయభ్రాంతులకు గురిచేయడం తగదు. యూనివర్శిటీ గేటులు మూసివేసి విద్యార్ధులను బయటకు రానీయకుండా నిర్భంధించడం దురదృష్టకరం. నిరుద్యోగులపై నిర్భంధాన్ని ప్రయోగించిన గత ప్రభుత్వాలు నేడు ఎక్కడున్నాయో జగన్మోహన్రెడ్డి తెలుసుకోవాలి. చంద్రబాబునాయుడు నిరుద్యోగులను మోసం చేసాడని ప్రచారంచేసుకొని అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం అదే పద్దతిలో వెళితే తగిన గుణపాఠం ప్రజలు చెబుతారు.
నిర్భంధాలను ఎక్కువగా ప్రయోగిస్తే ఉద్యమాలు ఆగవు. రేపు శాంతియుతంగా జరిగే కార్యక్రమానికి ఆటంకాలు కలిగించినట్లు అయితే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం అవుతుంది. అవసరమైతే సిపిఎం పార్టీ ఇతర రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కూడగట్టి రాజకీయపోరాటానికి దిగాల్సి వస్తుందన్నారు. ఆ పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్భంధంలో ఉన్న నాయకులను, వివిధ పోలీస్‌స్టేషన్లులో ఉన్న నాయకులను విడుదల చేయాలని కోరారు.