- ఉదయం సుప్రభాతం, ఆరాధన టికెట్లు నిలుపుదల.
- రాత్రి ఆరాధన టికెట్లు నిలుపుదల
- స్వాతి హోమం, నిత్యకళ్యాణం, స్వర్ణపుష్పార్చన,స్వర్ణతులసీదళార్చనంకు కేవలం ఐదు టికెట్లు మాత్రమే అమ్మబడును. ఒక్కో టికెట్ పై ఇద్దరికన్నా ఎక్కువమందికి అనుమతి ఉండదు.
- ఇకపై భక్తులకు మూడు వేర్వేరు క్యూలైన్లు – ర్యాంపులు ఏర్పాటుచేయబడును. దర్శనం దగ్గర ఒక క్యూలైన్ ఇంకో క్యూలైన్ తో కలిసే అవకాశం ఉండదు.
-టికెట్ కౌంటర్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 6:30 వరకే పనిచేస్తాయి
-యాత్రా సదన్ లో ఫ్రీ టికెట్లు ,బస్ టికెట్లిస్తారు. రూ.100, రూ.300 టికెట్లు శ్రీదేవి కాంప్లెక్స్ లో అమ్మబడును.
-దేవస్థానం బస్సుల్లో 50 శాతానికి మించి ఆక్యుపెన్సీ వరకు మాత్రమే అనుమతి
-టికెట్లు సైతం నిబంధనల మేరకే అమ్మకం. గంటకు ఫ్రీ టికెట్లు 610, వంద రూపాయల టికెట్లు 390, మూడు వందల రూపాయల టికెట్లు 100కి మించి ఇవ్వబడవు.
-శనివారం, ఇతర ముఖ్యమైన రోజులు మినహా రెండో ఘాట్ రోడ్డు మూసివేత. భక్తుల రద్దీబట్టి మళ్లీ ఓపెన్ చేయడం జరుగును.
-60 ఏళ్లు దాటిన వృద్ధులకు అనుమతి లేదు. ఆధార్ కార్డు ఆధారంగా దీన్ని చెక్ చేస్తాం.
ఉదయం 6:00 నుంచి 11:30 వరకు సర్వదర్శనములు
ఉ. 11:30 నుంచి 12:15 వరకు రాజభోగం (భక్తులకు దర్శనములుండవు)
మ. 12:15 నుంచి 2:30 వరకు సర్వదర్శనములు
మ. 2:30 నుంచి 3:30 వరకు పవళింపు (దర్శనములుండవు)
మ. 3:30 – రా. 7:00 వరకు దర్శనములు
రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు ఎటువంటి దర్శనములుండవు. ఆరాధన, పవళింపు, కవాట బంధనము ఉంటుంది.
(గమనిక : ఇంతకు ముందు రా.8:30 నుంచి 9:00 గంటల వరకు భక్తులకు దర్శనములుండేవి. ఇప్పుడు వాటిని రద్దుచేయడమైనది)

















