మొబైల్ టవర్ల రేడియేషన్ వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉండదని అంటున్నారు నిపుణులు
visakhapatnam: టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT)లో ఒక భాగమైన ఆంధ్రప్రదేశ్ లైసెన్స్
సర్వీస్ ఏరియా (LSA) యూనిట్ మార్చి 3, 2021న ‘‘ఇఎంఎఫ్ రేడియేషన్ గురించి ఆన్లైన్లో
అవగాహన వర్కుషాపు’’ను నిర్వహించింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ డిఓటి పబ్లిక్ అడ్వకసీ
కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహించింది. ఇఎంఎఫ్ రేడియేషన్ గురించి ఉన్న అపోహలు, ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, హేతుబద్ధమైన, విశ్వసనీయ ఆధారాలతో కూడిన సమాచారాన్ని అందించేందుకు ఈ వర్కుషాపును నిర్వహించారు. మొబైల్ టవర్ రేడియేషన్‌తో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ప్రజల్లో వ్యాపించి ఉన్న అపోహలను
తొలగించేందుకు, వైద్యులు, టెలికాం శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల
బృందం వర్కుషాపులో మాట్లాడారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ అధికారులు, సాధారణ ప్రజలు, నివాస సంక్షేమ సంఘాలు, విద్యార్థి ప్రతినిధులు, వైద్యులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, మౌలిక సదుపాయాల కల్పకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వి.సుందర్, సలహాదారు, ఏపీ ఎల్ఎస్ఏ, డీఓటీ, హైదరాబాద్; జి.వి.రమణ రావు, డిడిజి; ఎం.అరవింద్ కుమార్ డైరెక్టర్ (సి-ఐ), O/o సలహాదారు, ఎపి ఎల్ఎస్ఎ, డిఓటి, హైదరాబాద్; డా.చిన్న బాబు, సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్; కమాండర్ (విశ్రాంత) డా.జె. జెనా, డిడిజి, సిఒఏఐ; పి.పురుషోతం, సింధు టవర్స్ లిమిటెడ్; అశోక్, ఏజిఎం, బిఎస్ఎన్ఎల్; శ్యామల రావు, ఎయిర్టెల్ లిమిటెడ్ మరియు పి. రాజేష్ ఏడీ (కాంప్లియెన్స్), O/o సలహాదారు, ఏపీ ఎల్ఎస్ఏ, డీఓటీ, హైదరాబాద్ తదితరులు ప్రముఖ వక్తలుగా పాల్గొన్న వారిలో ఉన్నారు. మొబైల్ టవర్ ప్రాముఖ్యతను, నెట్వర్క్ కనెక్టివిటీని క్రమబద్ధీకరించేందుకు మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయని హైదరాబాద్‌లోని ఐటిఎస్ సలహాదారు వి.సుందర్ వివరించారు. దీని గురించి మరింత వివరిస్తూ ‘‘భారతదేశంలో, ఇఎంఎఫ్ రేడియేషన్ నిబంధనలు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్-అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (ICNIRP) సూచించిన పరిమితి కన్నా 10 రెట్లు కఠినమైనవి మరియు దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేస్తుంది. మానవ శరీరంపై ఇఎంఎఫ్ (EMF) సిగ్నల్స్ ప్రభావంపై ఇప్పటి వరకు వివిధ చోట్ల పరిశోధనలు జరిగాయి మరియు వీటి వల్ల జీవులపై చెడు ప్రభావం చూపుతుందనేందుకు నిరూపించేందుకు ఇప్పటి శాస్త్రీయ పరమైన ఆధారాలు లభించలేదని’’ స్పష్టం చేశారు.
అపోలో హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ డా.చిన్న బాబు మాట్లాడుతూ ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఇప్పటి వరకు 25,000 వ్యాసాలను అధ్యయనం చేసింది. మొబైల్ టవర్ ఇఎంఎఫ్ ఉద్గారాలకు,
మానవ ఆరోగ్యంపై అవి ఎటువంటి ప్రభావాన్ని చూపడం లేదని నిర్ధారణకు వచ్చింది. మొబైల్ టవర్స్ నుంచి వచ్చే తక్కువ స్థాయి ఎక్స్పోజర్లు మానవ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించవని’’
వివరించారు. జి.వి.రమణారావు, డిడిజి, (కాంప్లియెన్స్), O/o సలహాదారు, ఏపీ ఎల్ఎస్ఏ, డిఓటి, హైదరాబాద్ మాట్లాడుతూ ‘‘టెలికమ్యూనికేషన్ శాఖ (DoT) భారతదేశ వ్యాప్తంగా టవర్ల నుంచి వెలువడే ఇఎంఎఫ్ ఉద్గారాల స్థాయిని స్థాయిల్ని పర్యవేక్షిస్తుండగా, వాటిని సాధారణంగా ఫీల్డ్ యూనిట్లలో ఉద్గారాల ప్రమాణాలను నియంత్రిస్తుండగా, దాన్ని టెలికాం ఎన్ఫోర్స్మెంట్, రిసోర్స్, & మానిటరింగ్ లేదా పర్యవేక్షణ లేదా టెర్మ్ (TERM) సెల్స్‌గా వ్యవహరిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా 34 టెర్మ్ సెల్స్ ఉన్నాయి. ఈ టెర్మ్ సెల్స్ టీపీఎస్‌లు అందించిన నివేదికల్లోని ఉద్గారాలపై ధృవీకరణ ఆడిట్లను నిర్వహిస్తాయి. దానితో పాటు టెర్మ్ సెల్స్ క్షేత్ర స్థాయిలో భౌతిక ఆడిట్‌ను ర్యాండమ్‌గా ఎంచుకోవడం మరియు అందుబాటులో ఉన్న ఇఎంఎఫ్ సిగ్నళ్ల శక్తిని సైట్‌కు సమీపంలోని వివిధ ప్రదేశాల నుంచి పరీక్షిస్తారు. అంతే కాకుండా, ఇఎంఎఫ్ ఉద్గారాలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే అన్ని ఫిర్యాదులను ఇ-మెయిల్, పిజి పోర్టల్ ద్వారా లేదా డాక్ ద్వారా స్వీకరిస్తున్నారా లేదా అని కూడా టెర్మ్ సెల్స్ తనిఖీ చేస్తుంటాయని’’ వివరించారు.
మొబైల్ టవర్ ఇఎంఎఫ్ రేడియేషన్ ప్రతికూల ప్రభావాల గురించి ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి కఠిన పరీక్షల నడుమ పర్యవేక్షించబడతాయి మరియు విశ్వసనీయ వనరుల నుంచి అందుకుంటున్న రుజువుల ఆధారంగా ఇఎంఎఫ్ రేడియేషన్లతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కావని పలుసార్లు స్పష్టం చేసింది.