మంత్రాక్షరి పోస్టర్ ఓపెన్….సినీ పరిశ్రమకు అన్ని వనరులు పుష్కలంగా ఉన్న నగరం విశాఖ అని పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవిరిడే మూవీస్ పతాకంపై కురసాల విజయ్ కుమార్ ఇటకర్లపల్లి జగదీశ్ నిర్మాతలుగా జగదీశ్ దర్శకత్వంలో రూపొందించిన “ మంత్రాక్షరి” చిత్ర పోస్టర్ ను ఎంపీ ఆవిష్కరించారు. అక్కయ్యపాలెం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గల సింధూర ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో సినిమా చిత్రీకరించేందుకు అనువైన అన్ని సదుపాయాలను విశాఖలో కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకునేందుకు వీలుగా అవకాశాలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సినీ నటుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/