ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ వినియోగదారులకు కొత్త సంవత్సరంలో వినియోగదారులకు తియ్యటి వార్త చెప్పింది.దేశీ వాహన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కైగర్ ఈరోజున ఢిల్లీ లో (గురువారం,జనవరి 28) లాంఛనంగా విడుదల చేసింది.కైగర్ ను ముందు భారత్‌లో విడుదల చేసిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని రెనాల్ట్ ప్రకటించింది.రెనో ఇండియా సీఈఓ మరియు మానేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లి కైగర్ మోడల్ ప్రత్యేకతలను మీడియా కు వివరించారు. సరికొత్త కైగర్ అత్యాధునిక ఫీచర్లతో రానుందని,ఈ మోడల్ ఉత్తమ స్టైలింగ్‌తో బెస్ట్-ఇన్ క్లాస్ డిజైన్‌తో వస్తుందని వివరించారు.కైగర్ బి-సెగ్మెంట్లో లభిస్తుందని,మొత్తం పరిశ్రమ అమ్మకాల్లో 50 శాతానికిపైగా వాటాను దక్కించుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.దేశవ్యాప్తంగా కంపెనీ ఉనికిని పెంచేందుకు ఈ మోడల్ ఎంతో సహాయపడుతుందని నమ్ముతున్నట్టు తెలిపారు.డస్టర్,క్విడ్,ట్రిబెర్ మోడల్ లలాగే తన సిగ్మెంట్లో ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు.స్టన్నింగ్ డిజైన్,స్మార్ట్ క్యాబిన్ లతో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.ఇండియా కోసం డిజైన్ చేసి,అభివృద్ధిచేసిన కొత్త బ్రాండ్ కాంపాక్ట్ ఎస్.యు.వీ అని తెలిపారు.రెనో ద్వారా భారతదేశంలో ప్రారంభించే విప్లవాత్మక ఉత్పాదనలో రెనో కైగర్ అత్యాధునికమైనదన్నారు.కైగర్ ఒక వైవిధ్యమైన ఎస్.వీ.యు లుక్ కలిగి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు.స్మార్ట్ క్యాబిన్ ప్రయాణీకులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేయబడిందన్నారు. Renault KIGER Global Unveil – Renault kiger launch Event 2021 Vizagvision #Vizagvision #RenaultKIGER VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/