వ్యావ్యాపార అభివృద్ధికి కస్టమర్లను దేవుళ్ళు టాప్ స్కో,ఇండేన్ గ్యాస్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ రెడ్డి వ్యాపార అభివృద్ధికి కస్టమర్లు దేవుళ్ళని వారికి అత్యుత్తమ సేవలు అందించడానికి తమ కంపెనీ ద్వారా అన్ని ప్రయత్నాలు అమలు చేస్తున్నామని టాప్ స్కో, ఇండేన్ గ్యాస్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఆయిల్ కస్టమర్స్ డే పురస్కరించుకొని ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి శనివారం ఉదయం మహారాణి పేట రాక్డేళ్ లేఅవుట్ లో ఉన్న ద్వారకామయి ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ ఆధ్వర్యంలో వినియోగదారుల సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధిలో కస్టమర్లకు దేవునితో సమానంగా గౌరవాన్ని ఇవ్వాలని వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆ దిశగానే ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు కంపెనీ తరఫున కొన్ని రాయితీలు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అందిస్తున్నామని తెలిపారు. తమ సంస్థ జారీ చేసిన కొత్త ఫోన్ నెంబర్ 771895555 కు కాల్ చేయడం ద్వారా కష్టమర్లు త్వరితగతిన గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. వినియోగదారులు ఏదైనా సమస్యలు ఉంటే ఈ ఫోన్ నెంబర్ ద్వారా సేవలు పొందవచ్చునని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల వినియోగంలో వినియోగదారులు కంపెనీ సూచించిన పలు భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా గ్యాస్ అగ్ని ప్రమాదాలు జరగకుండా కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండవచ్చునని తెలిపారు. వంట కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ వినియోగం తర్వాత సిలిండర్లు రెగ్యులేటర్ తప్పనిసరిగా ఆఫ్ చేయాలని సూచించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కస్టమర్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకొని ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం, ఉచిత హాట్ ప్లేట్ సర్వీస్ క్యాంపు ఆయన ప్రారంభించి కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టిన ద్వారకామయి ఇండేన్పా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రధమ ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. విశ్వేశ్వరరావు, సెయింట్ ఆంటోనీ స్కూల్ హై స్కూల్ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ రత్నకుమార్, హెడ్మాస్టర్ ప్రసాద్ రావు, ఇండేన్ గ్యాస్ కంపెనీ జనరల్ మేనేజర్ర అశోక్ నాయుడు, సేల్స్ చీఫ్ మేనేజర్ జోష్నా , సేల్స్ సీనియర్ మేనేజర్ పి వి లలిత, సేల్స్ మేనేజర్ ఎం. బి. ఉమా దేవి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి కస్టమర్లను దేవుళ్ళు #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/