Sri Rama Taraka Andhra Ashram was opened at Kashi Kshetra కాశీ క్షేత్రంలో శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం తెరవడం జరిగింది Vizagvision..కాశీ క్షేత్రంలో నీ శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం గత మార్చ్ నుంచి కరోనా మహమారి కారణం గా కాశీలో చాలా మంది యాత్రికులు ఇరుక్కు పోవటం వలన మన ఆశ్రమం తరపున అందరికీ ఉచిత వసతి భోజనం ఏర్పాటు చేసి వారిని వారి వారి ఇంటికి బసులు ద్వారా పంపించే ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం యాత్రికులకు సేవ చేయలేక పోయాము ప్రస్తుతం గవర్నమెంట్ సుచలన ప్రకారం కాశీలో అన్ని దేవాలయాలు తెరిచారు మళ్లీ మన ఆశ్రమం కూడా యాత్రికుల సేవలో ముందుకు వచ్చింది . మన ఆశ్రమం తరపున కాశీకి వచ్చే యాత్రికులకు ఆశ్రమం తగు జాగ్రత్తలు తీసుకుంది .మైన్ గేట్ దగ్గర సేనిటైజేశన్ కెనాల్.రోజుకి రెండు సార్లు కెమికల్ ద్వారా స్ప్రే చేయుట.రోజుకి రెండు సార్లు సాంబ్రాణి పొగ వేయుట.మాస్క్ ధరించి ఆశ్రమం లో నికీ ప్రవేశం .భోజనం దగ్గర రెండు గజాల దూరం పాటించుట.రూమ్ ఖాళీ అయిన తరువాత రూముని సేనిటైజ్ చేయుట తగు జాగ్రత్తలు ఆశ్రమం తరపున తీసుకుంటున్నాం.యాత్రికులు కాశీకి వచ్చేటపుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా అశ్రమం తరపున కోరుతున్నాము
వి వి సుందర శాస్త్రీ
మేనేజింగ్ ట్రస్టీ
శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం
వారణాసి