మన్యంలో మావోయిస్టుల మందుపాతర నిర్వీర్యం గూడెం కోత్తవీధీ విశాఖ మన్యం Vizagvision…
మన్యంలో మావోయిస్టుల మందుపాతర నిర్వీర్యం
నిర్వీర్యం చేసిన మందుపాతర శకలం
గూడెం కోత్తవీధీ : విశాఖ మన్యంలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పోలీసులు గుర్తించి చి నిర్వీర్యం చేశారు. జీకే వీధి మండలం లోని కుంకుమ పూడి, పెదపాడు రహదారి కి ఆనుకొని మావోయిస్టులు అమర్చిన మందుపాతరను కూంబింగ్ పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతోచింతపల్లి ఏ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మంగళవారం సంఘటన స్థలానికి వెళ్లారు.ఆయన సమక్షంలో రెండు మందు పథరాలను నిర్వీర్యం చేశారు.ఈ సందర్భంగా ఎఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గతంలో పెదబయలు మండలంలో మందుపాతర పేలి ఇద్దరు సాధారణ గిరిజనులు చనిపోయారని ,మల్లి అటువంటి పొరపాటు జరగదని మావోయిస్టు నాయకులు ప్రకటించాల్సివచిందన్నారు.రహదారుల ప్రక్కన మందుపథరాలు అమర్చితే గిరిజనులకే ప్రమాదం పొంచివుందన్నారు