కర్రతో కొట్టి | గుండు కొట్టించి | శిరోముండనం కేసులో 7 మంది అరెస్ట్ CP Press Meet in Visakhapatnam,Vizagvision..
శిరోముండనం కేసులో ఏడుగురు అరెస్టు
సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో లో ఘటన
– దళిత యువకుడికి శిరోముండనం పై రగడ
★ విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్ నగర్ కు చెందిన దళిత యువకుడికి గుండు గీసి దాడి చేసిన ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ..
★ దీనికి సంబంధించిన వివరాలను శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్ లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు ..
★ శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన కర్రీ శ్రీకాంత్ 20 కు నాన్న అమ్మ చెల్లి ఉన్నారు..
★ ఉపాధి కోసం విశాఖ వచ్చిన అతడు నగరంలోని సుజాత నగర్ లో గల సినీ నిర్మాత బిగ్ బాస్ 2 సేమ్ నూతన్ నాయుడు ఇంట్లో నాలుగు నెలల క్రితం పనికి కుదిరాడు..
★ కాగా ఈ నెల 1 న జీతం తీసుకొని పని మానేశాడు..
★ తమ ఇంట్లో లో దొరికి గురైన సెల్ ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్ నాయుడు భార్య గురువారం రాత్రి శ్రీకాంత్ నీ ఇంటికి రప్పించారు..
★ సెల్‌ఫోన్ విషయమై నిలదీయడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్ వెళ్లిపోయాడు ..
★ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి సూపర్వైజర్ ద్వారా శ్రీకాంత్ ఇంటికి పిలిపించారు.
★ నూతన్ నాయుడు భార్య ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది అతన్ని గట్టిగా కొట్టి ఇ గాయపరిచారు .
★ ఆ తర్వాత బార్బర్ ను పిలిపించి శ్రీకాంత్ గుండు కొట్టించారు.
★ అంతటితో ఆగకుండా రాడ్డు తో దాడి చేసి అతన్ని గాయపరిచారు.
★ ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపించేశారు.
★ ఈ విషయం మీడియా ద్వారా శ్రీకాంత్ బహిర్గతం చేశాడు.
★ ఎందుకు పోలీసులు అతని స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారించగా మొత్తం వివరాలు ఫిర్యాదు రూపంలో ఇచ్చాడు .
★ ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేయగా దీంట్లో ఏడుగురు భాగస్వాముల్ని గుర్తించి అరెస్టు చేశారు .
★ అందులో లో ఉన్న నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి, ఇందిరా రాణి , వరహాలు బాలగంగాధర్, ఝాన్సీ, సౌజన్య రవికుమార్ తదితరులను శనివారం ఉదయం అరెస్టు చేశారు.
★ ఈ సంఘటనపై ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
★ పోలీస్ కమిషనర్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది..
★ దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తప్పక శిక్షిస్తామని సి పి మనీష్‌కుమార్ సిన్హా చెప్పడంతో ఆందోళనలు సద్దుమణిగాయి.
★ ఈ విలేకరుల సమావేశంలో సి పి తో పాటు డిసిపి క్రైమ్ , సౌత్ ఇంచార్జి డిసిపి వి. సురేష్ బాబు ఏసీపీ వెస్ట్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్, పెందుర్తి ఇన్చార్జి సీఐ మల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు..