ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఉన్నత విద్యపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ను 90శాతానికి తీసుకెళ్లాలని, మూడేళ్ల, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్షిప్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపై మరో ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోర్సులు బోధన జరగాలన్నారు.