Corona o Corona || కరోనా ఓ కరోనా నిన్ను చూసి మేము భయపడలా || Vizagvision
కరోనా ఓ కరోనా నిన్ను చూసి మేము భయపడలా!!
కరోనా అనగానే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు..అది కేవలం ఒక జ్వరము లాంటిదే..కేవలం పది నుంచి 14 రోజుల్లోనే తగ్గిపోతుంది.. కానీ అది సోకిన రెండు వారాలు మాత్రం భయాన్ని దగ్గరికి రానివ్వద్దు..ఐసోలేషన్ లో హ్యాపీగాఉండండి..ఫ్రండ్స్ తో చాటింగ్ చేసుకోండి.. యూట్యూబ్ లో వీడియోలు చూసుకోండి.. టెన్షన్ ,భయం,ఆందోళన అనే పదాలను డిక్షనరి నుంచి కొద్ది రోజులు పక్కన పెట్టండి..అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే మనం కంటికి కనిపించని శత్రువులతో పొరాడాం.. అమ్మ కడుపులో నుంచి బాహ్య ప్రపంచాన్ని చూడటానికి 9 నెలలు ఓపిక పట్టాం..ఇన్ని ఇబ్బందులు పడ్డ మనల్ని కరోనా బయపెడితే బయపడాలా..? భయాన్ని బాల్కనీ నుంచి బయటికి తోసేసి.. ధైర్యంగా ఉందాం.. డాక్టర్లకు, నర్సులకు సహకరిద్దాం…
కరోనాకు బయపడొద్దు… టెన్షన్ పడొద్దు..