Serving With PPE kits in Hotel “HASHTAG Resto Case” at Beach Road in Visakhapatnam,Vizagvision…
పీపీఈ కిట్ల తో హోటల్ లో సర్వింగ్
ఆకట్టుకొంటున్న హాష్ టాగ్ హోటల్ …..
కరోనా వైరస్ నేపథ్యంలో హోటళ్లకు వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు . నెలల తరబడి రుచికరమైన ఫుడ్ కి దూరమైనా వైరస్ భయం తో నోరు కట్టుకొని ఇంటి ఫుడ్ కే పరిమితమయిపోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని ఒక హోటల్ నిర్వహిస్తున్న యువ వ్యాపారవేత్త వినూత్నంగా ఆలోచించాడు. హోటల్ కి వచ్చే కస్టమర్ల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పీపీఈ కిట్లు ధరించిన సిబ్బందితో హోటల్ లో సర్వింగ్ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. విశాఖ బీచ్ రోడ్డులోని లాసన్స్ బే కాలనీ లోని హాష్ టాగ్ హోటల్ లో చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆకట్టుకొంటోంది . స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పూర్తి చేసిన బండారు సందీప్ ఫుడ్ ఇండస్ట్రీ పై మక్కువతో స్వయం ఉపాధి పొందాలన్న పట్టుదలతో ఈ హోటల్ ని ఇటీవలే ప్రారంభించాడు. పలు ప్రాంతాలను పరిశీలించి కంటైనెర్లలో హోటల్ ఏర్పాటు చేసాడు. హోటల్ పేరు లాగే ఈ కంటైనర్లు కూడా హాష్ టాగ్ ఆకారంలో ఉంటాయి. ఇండియన్,చైనీస్,మెక్సికన్ ,కాంటినెంటల్ స్టైల్ లో ఇక్కడ ఫుడ్ లభిస్తోంది. తమ హోటల్ లో పాట్ బిర్యానీ,అరిటాకు ఫిష్ (ఫిల్ -బిల్ ),మొఘలాయ్ బిర్యానీ,మెక్సికన్ స్టైల్ లో టాకోస్ ,నాకోస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నాయని హాష్ టాగ్ హోటల్ ఎండీ బండారు సందీప్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విశాఖలో తమదే తొలి కంటైనెర్ హోటల్ అని చెప్పారు. హాష్ టాగ్ రూపంలో వున్న కంటైనర్లలో 92 మంది కూర్చొనే వీలుందన్నారు. ఏసీ ,నాన్ ఏసీ సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన ప్రతీ నిభందనా తాము పాటిస్తున్నామని చెప్పారు . సుదీర్ఘ అనుభవం వున్న చెఫ్ లతో రుచికరమైన వంటకాలను హైజీనిక్ గా అందించడం తమ ప్రత్యేకత అని చెప్పారు. డోర్ డెలివెరీ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు తెలిపారు.

















