VIZAGVISION:Flames fired with thunderbolt in HPCL Fire Accident.Visakhapatnam..విశాఖలోని హెచ్పీసీఎల్లో శనివారం సాయంత్రం పిడుగుపడి అగ్నిప్రమాదం జరిగింది. భారీగా క్రూడాయిల్ నిలువ ఉన్న ట్యాంకుపై పిడుగు పడటంతో నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టారు. దీంతో భారీ ఎత్తున ఎగిసిన మంటలు కొంత వరకు అదుపు చేశారు. నగరంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మరి కొద్ది గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని హెచ్పీసీఎల్ వర్గాలు తెలిపాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేస్తామని పేర్కొన్నారు