రానున్న 48 గంటల్లో మరో అల్పపీడనం ఆగ్నేయ అరేబియా సముద్రంలో in Visakhapatnam,Vizagvision..మే 30 నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి, మాల్దీవులు, కన్యాకుమారి ప్రాంతాల్లో మరికొంత ముందుకి వ్యాపించాయి.ఇవి రాగల 24 గంటల్లో నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి, మాల్దీవులు, కన్యాకుమారి ప్రాంతాల్లో మరింత ముందుకీ వస్తాయని వాతావరణ శాఖ అంచనా.అరేబియా సముద్రంలో ఒమన్ దక్షిణ కోస్తాలొ వాయుగుండం బలపడుతోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో రానున్న 48 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడి మరునాటికల్లా వాయుగుండంగా మారుతుంది.నేటినుంచి జూన్ 2 వరకూ సూర్యతాపం, వడగాడ్పులు ఉండవని వాతావరణ శాఖ ప్రకటించింది.నేడు రేపూ దక్షిణాది రాష్ట్రాలలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయి.కేరళ కర్నాటకల్లో అతిభారీ వర్షాలు పడతాయి.