Special Story: Agency Lack of Infrastructure Adivasis Living a Miserable life in Araku,Visakhapatnam,Vizagvision…విశాఖపట్నం. అరకులోయ…….. ప్రశాంత వాతావరణానికి నిలయమైన విశాఖ ఏజెన్సీలో మౌలిక వసతులు లేక ఆదివాసీలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. గిరిజన సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్ఛిస్తున్నప్పటి కి ఫలితం మాత్రం కనిపించడం లేదు.ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల తలరాత మాత్రం మారడం లేదు. ఇప్పటికీ అనేక మారుమూల గిరిజన గ్రామాల్లో గిరిజనులు కనీస సదుపాయాలు లేక పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, రహదారి, విద్య, వైద్యం వంటి సదుపాయాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. అనంతగిరి మండలాన్ని దీనికి ఉదాహరణ గా పేర్కొనవచ్చు. దీనిపై vizagvision ప్రత్యేక కథనం….
విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండల పెద్ద కోట పంచాయతీ పరిధిలోకి వచ్చే మారుమూల మంఢ్రేబు గ్రామం ఇప్పటికీ కనీస సదుపాయాలుకు నోచుకోలేదు. రహదారి ,తాగునీరు వంటి సదుపాయాలు లేక గ్రామస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. పంచాయితీ కేంద్రానికి 30 కిలోమీటర్లు ,మండల కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండ్రేబు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలవడంతో ఒక్కోసారి గ్రామస్తులు తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురైన గిరిజనులు వైద్య సదుపాయాలు అందుబాటులో లేక నాటు వైద్యం ను ఆశ్రయిస్తూ తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఒక్కోసారి అశ్వాలను ఆశ్రయిస్తూ పంచాయతీ, మండల కేంద్రాలకు చేరుకుంటు అవస్థలు పడుతున్నారు . అలాగే రక్షిత మంచినీటి పథకం లేకపోవడంతో కలుషిత నీటిని సేవిస్తూ మంచాన పడుతున్నారు. కనీస సదుపాయాల కోసం ఎదురు చూసిన గ్రామస్తులు చివరికి చేసేదిలేక ఐక్యమత్యంతో పంచాయతీ కేంద్రానికి రహదారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నో దఫాలుగా పాలకులకు తమ గ్రామ సమస్యలను విన్నవించుకున్న ఇప్పటికీ ఫలితం లేకపోవడంతో చేసేది లేక గ్రామస్థులంతా ఐక్యమత్యంతో రహదారి ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు. ఇ ప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మండ్రేబు గ్రామంలో నెలకొన్నా సమస్యల పై దృష్టిసారించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
















