AP CM YS Jagan meet Victims at KGH LG Polymers Gas in Visakhapatnam,Vizagvision…విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని సీఎం జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించారు.విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా కేజిహెచ్ కు చేరుకున్నారు. రాజేంద్రప్రసాద్ వార్డ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న సాయంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సంఘటన జరిగిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ఏ విధంగా జరిగాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా పూర్తి అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి

















