భోపాల్ విషాదాన్ని గుర్తుకు తెచ్చిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ కెమికల్ గ్యాస్ లీక్ in Visakhapatnam,Vizagvision…
భోపాల్ విషాదాన్ని గుర్తుకు తెచ్చిన విశాఖ గ్యాస్ లీక్..
★ గత అర్ధరాత్రి విశాఖలో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటన ప్రజలకు భోపాల్ విషాదాన్ని గుర్తుకు తెచ్చింది.
★ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన విష వాయువుతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
★ వందల మంది ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. తమకు ఏం జరుగుతుందో తెలీకుండానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
★ 3 కిలోమీటర్ల మేర విష వాయువు వ్యాపించడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
గ్యాస్ లీక్ వల్ల కళ్లు కనిపించక బావిలో పడి ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా.. ముగ్గురు మృతి చెందారు.
★ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందున అధికారులు, జిల్లా యంత్రాంగం హుటాహుటిన చర్యలు ప్రారంభించారు.
★ కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటన భోపాల్ విషాదాన్ని గుర్తు చేసింది. 1984లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 4వేల మంది మృతిచెందారు.
★ యూనియన్ కార్బయిడ్ రసాయనాల కర్మాగారం నుంచి వ్యాపించిన టన్నుల కొద్ది విష వాయువు విడుదలైన 24 గంటల్లోనే 3 వేల మందికి పైగా చనిపోయారని అంచనా. ఆ తరువాత మరి కొన్ని వేల మంది ఆ విషపు గాలులకు, అనంతర పరిణామాలకు బలయ్యారు.
★ అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక విధ్వంసం. బతికి ఉన్న వాళ్ళలో కూడా వేలాది మంది ఆ ప్రభావానికి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు లోనయ్యారు.

















