Kirandul Railway line is Undergoing Repairs Sudden Breaking Cliff Breaks at S.Kota,Vizag Vision….విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం చీముడుపల్లి గ్రామసమీపంలో విశాఖ కిరాండాల్ రైల్వే లైన్ రిపేర్ పనులు జరుగుతుండగా వీరి పై అకస్మాత్తుగా కొండ చరియలు విరిగిపడటం తో శృంగవరపుకోట రైల్వే OH డిపార్టుమెంట్ కు చెందిన వి. సురేష్ అనే ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు .
ఈ పనులలో కొత్తవలస కు చెందిన ముగ్గరు కాంట్రాక్ట్ లేబర్ కు ముగ్గురు రైల్వే ఉద్యోగులకు తీవ్ర గాయాలు పాలవటం తో హుటాహుటిన శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వీరి పరిస్థితి విషమంగా ఉండటం తో ప్రధమ చికిత్స చేసి విశాఖ కు తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని ఆసుపత్రి డాక్టర్ సుధ తెలిపారు.
మృతుడు సురేష్ కు భార్య విమల ఇద్దరు చిన్న పిల్ల కలిగి ఉన్నాడు. ఎప్పటిలా ఉద్యగానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న భార్య పిల్లలు విగత జీవిగా రావటంతో వారి భాద వర్ణనాతీతం.
సంఘటనా స్థలం లో జరిగిన ప్రదేశంలో సంఘటనా సమయంలో సుమారు ఎనబయ్యిమంది వరకు కూలీలు ఉండి ఉంటారని చనిపోయిన వారిలో ఇంకా కొంత మంది ఉండవచ్చని వారి గురించి రైల్వే శాఖా కొనసాగింపు చర్యలు చేపడుతున్నారు.

















