తెలుగుదేశం పార్టి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 12 గంటల నిరాహార దీక్ష….. విశాఖ జిల్లా గాజువాక లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష లో పాల్గున్నారు ,
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేదలకు రోజువారి కూలీలకు ఇచ్చే వెయ్యి రూపాయలు సరిపోవని కనీసం 5000 రూపాయలు అయినా చెల్లించాలని, మూసివేసిన అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలని, భీమా పథకం పునరుద్ధరించాలని, ధాన్యం పత్తి మిర్చి ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ, ఆక్వా, పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని, కరోనా పై ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ కార్మికులు వైద్య సిబ్బంది పోలీసులు రెవెన్యూ వారుకి మరి ఇతర అధికారులు కి రక్షణ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు.
















