గిరిజన గ్రామాల్లో ప్రకృతి సిద్ధమైన జీలుగు కల్లు “Jeelugu Kallu” Story at Paderu in Visakhapatnam,Vizagvision…పాడేరు,డివిజన్ పరిధిలో కొన్ని గిరిజన గ్రామాలో ప్రకృతి సిద్ధమైన జీలుగుకల్లు”అంటే చాలా మంది మందు బాబులకు ఇష్టం ప్రతిరోజు ఉదయం సాయంత్రం జీలుగుకల్లు”గీత కార్మికుడు తీసి రోజుకు 4 వందల నుంచి 1500 రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఈ జీలుగుకల్లు”రుచే వేరు దీన్ని తాగటం గ్లాస్ తో కాకుండా దీన్ని తాగడానికి డోకిబుర్రతో తాగుతారు ఈ జీలుగుకల్లు” తాగడానికి ఆచారం అలా తాగితే ఈ కల్లు కొత్త రుచి వస్తుంది అంట పాడేరు, మండలంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో ఈ జిలుగుకల్లు” దొరుకుతుంది లాక్ డౌన్” కారణంగా మందుబాబులకు మందు దొరక్క జీలుగుకల్లుకు ఎక్కువగా ఎగబడుతున్నారు. జీలుగుకల్లు”తీసే పద్ధతి కొందరికి కొత్తగా ఉండటంతో జీలుగుకల్లు”మంచిగా ఉందని కొందరు చెబుతున్నారు అప్పుడే చెట్టు నుంచి తీసిన జీలుగుకల్లు”తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ నాశనం చేస్తుందని పూర్వీకులు చెబుతున్నారు చెట్టు నుంచి వెంటనే తీసిన కల్లు తాగితేనే ఈ ఫలితాలు అందుతాయని జీరుగు చెట్ల నుంచి తీసిన జీలుగుకల్లు కొన్ని గంటలు అలాగే ఉంచితే పులిసిపోయి ఆల్కహాల్ గా మారుతుందని దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం జీరుగు చెట్టు నుంచి అప్పుడే తీసిన జీలుగుకల్లు తాగాలని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని జీలుగుకల్లు” ఖనిజ లవణాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని మసాలా మాంసాహారాలు జంకు ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ జీలుగుకల్లు”తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అని మన పూర్వీకులు ఏనాడో చెబుతున్న మాట ప్రస్తుతం ఇది నిజమని కొందరు అంటున్నారు డయోరియా,టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు ఈ జీలుగుకల్లు” యాంటీబయాటిక్ గా పనిచేస్తుందని కొందరు అంటున్నారు
















