Containment zone రెడ్ జోన్ ఏరియాలను దిగ్బంధం చేశారు at Akkayyapalem,Dondaparthi & Tathichatpalem in Visakhapatnam,Vizagvision….విశాఖ రెడ్ జోన్ ఏరియాలను దిగ్బంధం చేశారు. రెడ్ జోన్ ఏరియాలో నివాసిస్తున్నవారు బయటకు రాకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాలైన ముస్లిం తాటిచెట్లపాలెం, రైల్వే న్యూకాలనీ, దొండపర్తి, అక్కయ్యపాలెం ప్రాంతాల్లో నివసిస్తున్నవారి అవసరాలు తెలుసుకుని వాలెంటీర్లు,వార్డు కార్యదర్శులు పని చేయాలన్నారు. రెడ్ జోన్ ప్రాంతాలవారు బయటకురాకుండా ఉండటమే తమ లక్ష్యంగా ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని డిసిపీ 1 రంగారెడ్డి తెలిపారు. నిత్యవసర వస్తువులు 100 రూపాయలకే ఇచ్చేవిధంగా ఏర్పాటు చేశామని అర్భన్ ఎంఆర్ఓ జ్జానవేణి అన్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజా అవసరాలు తీర్చేందుకు పోలీసులను నియమించి, ఒకొక్క సిఐకు 15 మంది వాలెంటీర్లను అప్పగించారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతిఒక్కరు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహారాణిపార్లర్ వద్ద జరిగిన సమావేశంలో వాలెంటీర్లు, వార్డు కార్యదర్శులు, పోలీసులు,జివియంసీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
















