Distributions of 21 Varieties Essentials & Vegetables by Qadar Wali Committee Youth in Thatichetlapalem,Visakhapatnam,Vizag Vision.ఆ యువకులంతా రోజువారీ కూలీలు, చిరుద్యోగులు.. అక్కయ్యపాలెం ప్రాంతంలోనే వలస కూలీలు కూడా ఎక్కువే. కరోనా మహమ్మరి వీరీలో చాలా మంది ఉపాధి దెబ్బతీస్తే.. పేదల కడుపుమాడ్చేస్తోంది. దీంతో తోటివారు అర్ధాకలి తీర్చేందుకు సిద్ధమయారు ముస్లింన్తాఅతిచెట్లపాలెం పెద్దూరుకు చెందిన యువకులు. సంపాదించిన దాంట్లో కొంత వెచ్చించి పేదలకు సాయం చేశారు. 21 రకాల నిత్యావసరాలు, కూరగాయలను ఇంటింటికి వెళ్ళి పంచారు. ‘ కరోనాపై కలసికట్టుగా పోరాడదాం.. పేదలకు తోచినైన సాయం చేద్దాం’ అనే నినాదంతో ముస్లిం తాటిచెట్లపాలెం లో ఖాదర్ వలీ కమిటీ యువకులు ఆదర్శంగా నిలిచారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా నివారణపై అవగాహన పెంచుతున్నారు.

















