కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం ఉభయ తెలుగు రాష్ట్రాలకు రూ.పదేసి కోట్లు,Vizagvision…
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు రూ.20 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు పది కోట్ల రూపాయల చొప్పున ఈ విరాళాన్ని అందించారు.
కరోనా వల్ల దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయిన నేపథ్యంలో వార్తామాధ్యమాలుగా ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్లు ప్రజా చైతన్యం కోసం యథాశక్తి కృషి చేస్తున్నాయి.
ఆర్థికంగా కూడా తెలుగు వారికి చేదోడుగా నిలవాలన్న లక్ష్యంతో రామోజీరావు తన గ్రూపు సంస్థల తరఫున ఈ విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు అందించారు.
ముఖ్యమంత్రులను నేరుగా కలిసి ఇవ్వడానికి సంచార నిషేధం ఉన్న కారణంగా మంగళవారం ఆన్లైన్లో ఈ విరాళాన్ని బదిలీ చేశారు.
కరోనా కట్టడికి ముఖ్యమంత్రుల సారథ్యంలో సాగుతున్న ఈ పోరులో ప్రజలు విజయం సాధించాలని, ఉభయ రాష్ట్రాలూ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని రామోజీరావు ఆకాంక్షించారు….
















