విమానాశ్రయం బయట బైఠాయించిన చంద్రబాబు in Visakhapatnam,Vizagvision…విమానాశ్రయం బయట బైఠాయించిన చంద్రబాబు విశాఖ విమానాశ్రయం బయట వైకాపా-తెదేపా కార్యకర్తల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబు రాకను నిరసిస్తూ వైకాపా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఆయన వాహనశ్రేణిని కదలనీయకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పటికే రెండుగంటలకు పైగా వాహనంలో కూర్చొన్న చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితం కిందికి దిగారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ నేతలు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, పంచుమర్తి అనురాధ తదితరులతో కలిసి అక్కడే రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు చంద్రబాబును తిరిగి విమానాశ్రయంవైపు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
















