Nagavali River is fogging the heavy rains in Odisha.Vizagnaram,Vizagvision…ఒడిశా లో కురుస్తున్న భారీ వర్షాలకి పొగిపొర్లుతున్న నాగావళి నది. నీటలో మునిగిన రాయగడ జిల్లా కళ్యాణ సింగుపూర్ . తెరుబలి వద్ద నాగావళి ఉద్రితికి కొట్టుకుపోయిన రైల్వే బ్రిడ్జి. నాగావళి ఉదృతంగా ప్రవహిస్తుండడం తో ఆంధ్రా- ఒడిశా రాకపోకలకు అంతరాయం. విజయనగరం జిల్లా కోమరాడ మండలం కోనేరు వద్ద రాయగడ రహదారి పైకి వచ్చిన వరద నీరు. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలుభారీ వర్షాలతో వరదల కారణంగా రాయ్గడ-తితిలాగర్ సెక్షన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒడిశాలోని రాయగడ జిల్లాలో వరదల కారణంగా ఆదివారం ఉదయం తెరువలి-సింగాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న 585 నంబరు రైలు వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు ట్రాక్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ కారణంగా కొన్ని రైళ్లను క్రమబద్ధీకరించి, కొన్నిటిని రద్దు చేశారు.నాగావళి వరద పై లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశాం, రెవిన్యూ, నీటిపారుదల శాఖలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి, ఐ.టి.డి.ఏ. కార్యాలయంలో వరదల పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం, నాగావళి లో వచ్చిన వరద నీటిని పూర్తిగా కిందికి విడిచి పెడుతున్నాం. కొమరాడ మండలం చోళపదం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కొండపై నాగావళి వరదల్లో చిక్కుకున్నట్టు సమాచారం అందింది. ఈ వ్యక్తిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఎస్.డి. ఆర్.ఎఫ్.బృందం ప్రట్నం చేస్తోంది. ఎన్డి.ఆర్.ఎఫ్. బృందం బయలుదేరి వస్తోంది. వరదనీరు తగ్గితే ఆ వ్యక్తిని ఈ రాత్రికే సురక్షితంగా తీసికొస్తాం, పార్వతీపురం డివిజన్ లోని అన్ని మండలాల్లో రెవిన్యూ యంత్రాంగం ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు; వరద సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్విజయనగరం జిల్లా… పార్వతీపురము డివిజన్ గరుగుబిల్లి మండలo నాగావలి రిజర్వులో కి 1లక్ష ,30 వేలు కూసికులు నీరు చేరగా లక్ష కూసికులు నీటిని దిగువకు విడుదల.కొమరాడ మండలం దుగ్గి, పాత కొళ్లకోట, గుణాణపురం, పూర్ణపాడు గ్రామాలలోకి చేరుకుంటున్న వరదనీరు, నీటితో పాటు పాములు రావటంతో భయందోళనలలో గ్రామస్థులు….Visakhapatnam,Vizagvision….