Avsar Scholarship Programme Akshaya Patra Foundation in Visakhapatnam
అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు అవసర్ స్కాలర్షిప్ వితరణ
ప్రభుత్వ ఫాఠశాలల్లో చదివే విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ వారు 19 లక్షమంది కి మధ్యాహన భోజనం దేశవ్యాప్తముగా విద్యార్థులకు అందిచుచున్నాను . అక్షయ పాత్ర ఫౌండేషన్ మధ్యాహన భోజనం తో పాటు విద్యార్థులకు అనేక రకముల సదుపాయములు సమకూర్చడం జరుగుతుందు .
1.నైపుణ్యము గల విద్యార్థులకు స్కాలర్షిప్ వితరణ, 2.మెడికల్ క్యాంప్స్ అండ్ విద్యార్థులకు కౌన్సిలింగ్
3.టాలెంట్ హంట్, 4. నొనె బుక్స్ డిస్ట్రిబ్యూషన్, 5. డ్రెస్ డిస్ట్రిబ్యూషన్, 6. షూస్ డిస్ట్రిబ్యూషన్
విద్యార్థులకు స్కాలర్షిప్ వితరణలో భాగముగా ఈ సంవత్సరము విశాఖపట్నములో 48 మంది విద్యార్థులకు 2500 నుంచి 15000 రూపాయల వరకు మొత్తం 183775 రూపాయలు అందచేయడం జరిగింది.ఈ రోజు జిల్లా పరిషత్ హై స్కూల్ కణితి లో 5 మంది ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు స్కాలర్షిప్ ను కలెక్టర్ ఆఫీస్ నందు జిల్లా సంయుక్త కలెక్టర్ వారి గది నందు విద్యార్థులకు అందచేయడం జరిగింది .
స్కాలర్షిప్ వితరణ లో పాల్గున్న అతిధులు
1.శ్రీ ఏల్. శివ శంకర్ గారు ఐఏఎస్ , జిల్లా సంయుక్త కలెక్టర్
2..శ్రీ నిష్క్రించిన భక్త దాస ప్రెసిడెంట్ అక్షయ పాత్ర ఫౌండేషన్
3.ప్రాణనాథ దాస అక్షయ పాత్ర ఫౌండేషన్ , విశాఖపట్నం
ఈ రోజు స్కాలర్షిప్ అతిధుల నుంచి తీసుకున్న విధ్యార్దులు 1. బి. లావణ్య , 2.D.అక్షయ 3. N. అశోక్ చిన్ని కుమార్ 4.ఎస్.సంపద రావు మరియు 5.చీపురుపల్లి .భవాని . జిల్లా పరిషత్ హై స్కూల్ కణితి
అక్షయపాత్ర ఫౌoడేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యములో 2008 సం లో 5000 మంది విధ్యార్దులకు మద్యాహ్న బోజనాన్ని గాజువాక లోని 07 జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రారంబించడం జరిగింది. ప్రస్తుతం రోజు విశాఖపట్నం లో 51000 మంది విధ్యార్దులకు మద్యాహ్న బోజనాన్ని అందించుచున్నాము . (334 పాఠశాలల్లో 51000 మంది విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 155 స్కూల్స్ , ఆనందపురం , భీమునిపట్నం మండలంలో 179 స్కూల్స్ ) మద్యాహ్న బోజనాన్నిఅందచేయడం జరుగుతున్నది. సమాజంలో వివిధ రకాలయిన దాతలు ,కార్పొరేట్ సంస్దలు రాష్ట్రప్రభుత్వాలు మరియు భారతప్రభుత్వం అందించే సహాయ సహకారాలతో “అక్షయపాత్ర పౌoడేషన్” ఈ బృహత్కర కార్యక్రమాన్ని విజయవoతంగా అమలు చేస్తూ విధ్యార్దులకు రుచికరమైన పోసకవిలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నాము.
ఈ సందర్బంగా విద్యార్థులు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారికి కృతఙ్ఞతలు తెలిపినారు తమ పాఠశాలకు అక్షయ పాత్ర వారి మధ్యాహన భోజనం రావడము తమ అదుష్టముగా భావించు చున్నాము . మేము 6 వ తరగతి నుంచి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు పంపించిన రుచికరమైన మధ్యాహన భోజనం తీసుకున్నామని తెలిపినారు జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి తెలిపినారు .
శ్రీ ఏల్. శివ శంకర్ గారు ఐఏఎస్ , జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ అక్షయ పాత్ర వారు భోజనము తో పాటు అనేకరకాల సేవ కార్యక్రమాలు నిర్వహించు చున్నారు. ఈ అవకాశములను విద్యార్థులు ఉపయోగించుకొని ఉన్నత స్థానములకు వెళ్లగలుగు తున్నారు అని అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి సేవ కార్యక్రమాలను ప్రశంసించారు .
ఈ సందర్బంగా అక్షయపాత్ర పౌoడేషన్ విశాఖపట్నం అద్యక్షులు శ్రీనిష్కిoచిన భక్తదాస గారు తమ సంస్ట కు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు , కార్పొరేట్ సంస్దలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ కృతఙ్ఞతలు తెలియచేసారు.

















