స్టాక్‌మార్కెట్లు ఇవాళ పరుగులు తీస్తున్నాయి.
ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 40 వేల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది జూలై తర్వాత సెన్సెక్స్ ఈ దూకుడు ప్రదర్శించడం ఇదే మొదటిసారి.
ఇవాళ ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 250 పాయింట్లు పుంజుకున్నది. విదేశీ నిధుల రాబడి, ఇన్వెస్టర్లకు పన్ను రాయితీల నేపథ్యంలో మార్కెట్లు పరుగులు తీసినట్లు తెలుస్తోంది.
నిఫ్టీ కూడా 35.85 పాయింట్లు అడ్వాన్స్ సాధించింది..
ట్రేడింగ్‌లో 11 వేల 822 పాయింట్ల మార్క్‌ను దాటేసింది.
సెన్సెక్స్ ట్రేడింగ్‌లో భారతి ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, వేదాంత, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీలు రెండు శాతం వృద్ధి సాధించాయి.
ఆర్బీఐ జరిమానా వేసిన బందన్ బ్యాంకు షేర్లు ట్రేడింగ్‌లో పడిపోయాయి.

















