Large Pond is Full of Rain Water Coming Over Roads & Houses in Vizagnagram,Vizagvision..గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, గెడ్డలు, చెరువులు పూర్తిగా నిండిపోయాయి. వచ్చిపడుతున్న వరద నీటితో ఉప్పోంగిపోతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న వ్యత్యాసం లేకుండా వర్షం నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, భోగాపురం, విజయనగరం పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. విజయనగరం పట్టణంలోని పెద్ద చెరువు వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో , ఆ చెరువులోకి వస్తున్న వర్షపునీరు గట్లపై నుంచి పొంగిపొరలుతూ ప్రవహిస్తుంది. చెరువు దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించడంతో తోటపాలెం ప్రాంతం అంతా జలమయం అయింది. ఈ ప్రాంతంలోని పలు అపార్టుమెంట్లు జలదిగ్ధంలో ఉన్నాయి. గ్రౌండ్ఫ్లోర్లు అన్నీ నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బురదనీరు ఇండ్లలో చొచ్చుకుపోయి, పాములు, కప్పలు ప్రవేశిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి వరదనీటిలో ప్రజలు అవస్ధలు పడుతున్నారు. కంటిమీద కునుకు లేకుండా భయంతో కాలం గడిపే పరిస్ధితి నెలకొంది. గురువారం తెల్లవారి నుంచి వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి , సహాయక చర్యలు చేపట్టారు. అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలతో విజయనగరం జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై