It’s another Uddanam? Growing Kidney Patients Mondipalaem in Anakapalli,Visakhapatnam,Vizagvision…
ఇది మరో ఉద్దానమా?విశాఖ జిల్లా మొండిపాలెంలో పెరుగుతున్న కిడ్నీ రోగులు…విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయితి మొండిపాలెంలో నెలకొని ఉంది.
ఈ గ్రామజనాభా దాదాపు 500 ఉంటుంది. 130 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తుల్లో చాలా మంది సమీపంలో ఉన్న క్వారీలలో రోజు వారీ వేతనం మీద కూలి పనులకు వెళుతుంటారు.
గత 10 ఏళ్ల నుంచి కిడ్నీ సమస్య ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 50 మంది చనిపోయారు. గతేడాది 20 మంది చనిపోగా, మరో 30 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చాయి.
”40 ఏళ్లు దాటిన మా మామయ్య కిడ్నీ సమస్యతో చనిపోయారు. 40 ఏళ్లు దాటిన వారిలో ప్రాణభయం నెలకొంది. కిడ్నీ సమస్యల మూలంగా మా ఊరును తరలిస్తారని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా ఊరికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు” అని చెప్పారు.క్వారీల వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కొందరు గ్రామస్తులు అంటున్నారు మొదట రెండు క్వారీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 5కు పెరిగింది. దానితో పాటుగా 5 మెటల్ క్రషింగ్ యూనిట్లు వచ్చాయి. గ్రామస్తులలో ఎక్కువ మంది ఈ క్రషింగ్ ప్లాంట్ లలోనూ, క్వారీలలోనూ పనిచేస్తున్నారు ఇక్కడ క్వారీలలో పనిచేస్తున్న 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యనున్న పురుషుల్లో ఎక్కువ మందికి కిడ్నీ వ్యాధులు వస్తున్నట్టు గుర్తించారు. అదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.