పోలీస్ పరేడ్ మైదానంలో 73 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు in Visakhapatnam,Vizag Vision..విశాఖ లోని పోలీస్ పరేడ్ మైదానంలో 73 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి మోపిదేవి వెంకట రమణ ముఖ్య అతిధిగా ఈ వేడుకలో పాల్గొని..త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం పోలీసు, ఎన్ సి సి, స్కౌట్ దళాల గౌరవ వందనం స్వీకరించారు.జిల్లా అభివృద్ధి కార్యక్రమాల నివేదిక ప్రజలకు తెలియజేసారు. విశాఖ జిల్లా లో వివిధ ప్రభుత్వ పధకాలు తెలియజేస్తు ఆయా శాఖలు అందంగా ముస్తాబు చేసిన శకటాల కవాతు అందరిని ఆక్కట్టుకుంది. విఎంఆర్డీఎచైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివిసత్యనారాయణ, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు.


















