సముద్రంలో ప్రమాదం Outer Harbour Jaguar Tug Boat Catches Fire in Visakhapatnam,Vizag Vision…..విశాఖ సముద్ర తీరంలో పోర్టులోకి వచ్చే మార్గంలో ఒక నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. జాగ్వర్ అనే టగ్ లో అగ్నిప్రమాదం జరిగిదని చెపుతున్నారు. నల్లని పొగలు ఆకాశానికి ఎగసిపడుతూ తీరాన ఉన్నవారికి సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న పొగ..మంటలకు కొందరు సిబ్బంది అస్వస్థతకు గురికాగా వారిని హెలికాప్టర్లతో రక్షించి నేవీ ఆస్పత్రి ఐఎన్.హెచ్.ఎస్. కల్యాణికి తరలించారు. పోర్ట్ పనుల కోసం ఈ టగ్ ను వైజాగ్ పోర్ట్ అద్దెకు తీసుకుందని తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు సముద్రంలోకి ఫైర్ ఇంజన్ బోట్లను పంపుతున్నారు. పోర్ట్ అధికారులు సంఘటన గురించి నోరు మెదపటం లేదు. ఇంజన్లో సమస్యవల్ల మంటలు రేగి డీజిల్ టాంకుకు వ్యాపించాయంటున్నారు. భారీ నౌకలను పోర్టు బెర్తుల మీదికి చేర్చటానికి, తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లటానికీ ఈ టగ్గులను వాడతారు.పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న పొగ..మంటలకు కొందరు సిబ్బంది అస్వస్థతకు గురికాగా వారిని హెలికాప్టర్లతో రక్షించి my cure ఆసుపత్రికి కొందర్ని..ఇంకొందర్ని నేవీ ఆస్పత్రి ఐఎన్.హెచ్.ఎస్. కల్యాణికి తరలించారు. పోర్ట్ పనుల కోసం ఈ టగ్ ను వైజాగ్ పోర్ట్ అద్దెకు తీసుకుందని తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు సముద్రంలోకి ఫైర్ ఇంజన్ బోట్లను పంపుతున్నారు. పోర్ట్ అధికారులు సంఘటన గురించి నోరు మెదపటం లేదు. ఇంజన్లో సమస్యవల్ల మంటలు రేగి డీజిల్ టాంకుకు వ్యాపించాయంటున్నారు. భారీ నౌకలను పోర్టు బెర్తుల మీదికి చేర్చటానికి, తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లటానికీ ఈ టగ్గులను వాడతారు.