Commissioning Ceremony IN LCU 56 || నావికా దళ ఎల్ సి యు ఎల్ 56 కమీషన్ || Visakhapatnam,Vizagvision…మేకిన్ ఇండియా లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొలకత్తా గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ తయారుచేసిన ఎల్ సి యు ఎల్ 56 ను తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని విశాఖ నావెల్ డాక్ యార్డ్ లో కమిషన్ ఇంగ్ చేశారు. ముందుగా నావికా దళ సిబ్బంది నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్ సి యు ఎల్ 56 భారత యుద్ధనౌకల తో కలిసి పాల్గొనడంతోపాటు, భూమి మీద నుండి సముద్ర జలాల్లోకి వస్తువులను తీసుకు వెళ్లడం, భూమి మీదకి చేరవేయడం లాంటి ప్రత్యేకతలు కలిగిన ఈ నౌకను అండమాన్ నికోబార్ తీర ప్రాంతంలో గస్తీ కి ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కాబడిన ఈ యుద్ధనౌక అనేక ప్రత్యేకతలు కలిగి ఉందని అన్నారు. కమీషన్ ఇంగ్ అవుట్ వారెంట్ ను కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కామ డోర్ గోపీనాథ్ నారాయణం చదివారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీకే సక్సేనా మాట్లాడుతూ పూర్తి భారత్ సాంకేతిక పరిజ్ఞానం తో తయారుచేసిన నౌకను తూర్పు నావికాదళానికి అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నావికా దళ అధికారులు మరియు గార్డెన్ రిచ్ కమాండర్ ఆశుతోష్ రీ దొరకరు తదితరులు పాల్గొన్నారు