International Yoga Day సరైన ఆహారం, వ్యాయామం, ధ్యానం యోగ సాధన కు పట్టు కొమ్మలు,Vizagvision…ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న బీచ్ రోడ్లో అత్యద్భుతంగా ఆసన, ధ్యాన కార్యమాల్ని సిద్ధ గురువులు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి నిర్దేశనంలో నిర్వహించారు. వందల సంఖ్యలో యోగ సాధకులు, ఔత్సాహికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు కార్యక్రమం ప్రారంభమైంది. సూర్యుడికి అభిముఖంగా అందరు ఆసీనులై సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన, ఓంకారోచ్చారణ, ఆసనాలు సామూహికంగా చేసారు. భారత దేశంలో ప్రభవించి, యావత్ ప్రపంచానికి మానవ జీవన పరమార్ధాన్ని చాటిన మహా విజ్ఞానమే యోగం. అనాదిగా ఈ విద్యను ఆనాడు ఎందరో తాపసులు, ముముక్షులు, యోగులు, నేడు ఆధునిక మానవులు సాధన చేసి శరీరాన్ని రోగ గ్రస్తం కనీయకుండా కాపాడుకోగలుగుతున్నారు. యోగం అంటే శరీరం, మనసు, ఆత్మల కలయిక. ఈ నేలలో పుట్టిన యోగ విద్యను అందరూ అభ్యసించగలిగితే, కాన్సర్ వంటి మహమ్మారిని కూడా దూరం చేయవచ్చు అని మాతాజీ గారు వివరించారు. సరైన ఆహారం, వ్యాయామం, ఆత్మ శక్తికి ధ్యానం ఈ మూడు యోగ శాస్త్రానికి పట్టుకొమ్మలని చెప్పారు సిద్ధ గురువులు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు. భారతాయిలంతా గర్వంగా జరుపుకోవాల్సిన విశేషమైన రోజు యోగ డే అని అన్నారు అమ్మగారు.


















