“Our Conscience – Our Chief Minister” Success Meet Success “మన అంతరాత్మ – మన ముఖ్యమంత్రి” by Twinkle Shyam in Visakhapatnam,Vizagvision…నూతన ముఖ్యమంత్రితో రాష్ట్రం సుభిక్షం
పరమేశ్వరుని దివ్య ఆశీస్సులతో తనచే చెప్పబడిన భవిష్యత్తు నిజమైందని ,నూతన ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షం కానుందని ప్రముఖ విద్యావేత్త ,ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యాం పేర్కొన్నారు. శుక్రవారం పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంతకు మునుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా పార్టీ 125 స్థానాల పైన గెలుపొందుతుందని పేర్కొన్నానన్నారు. జనసేన పార్టీ పో టి ఏ కాదని , ఒక్క సీటు కూడా సాధించడం కష్టం అని తెలిపానన్నారు. ఆ మాటలు ప్రస్తుతం నూరుశాతం నిజం అయిందన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఒక గురువు, దైవంగా భావించి ఒక భక్తునిగా తన వద్దకు రప్పించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తను స్వతహాగా ఏ రాజకీయ నాయకులను కలవనని, కానీ తన వద్దకు వచ్చే నాయకులకు మాత్రం తన శక్తివంచన లేకుండా ఉన్నది ఉన్నట్లుగా భవిష్యత్తును చెప్తానన్నారు. ప్రస్తుతం గెలిచినవారు జగన్మాత అమ్మవారికి పంచామృత అభిషేకం చేయించాలన్నారు. గోవుల పెంపకం, చెట్ల పెంపకం విపరీతంగా ఒక ఉద్యమంలా జరగాలన్నారు. విందు ఏర్పాటు చేసి వస్త్ర దానం చేయాలన్నారు. రైతులు, సైనికుడు, పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా ఉంటేనే దేశానికి మంచిది అన్నారు. తద్వారా రాష్ట్రం దేశం సన్మార్గంలో ఉంటుందని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని ట్వింకిల్ శ్యాం పేర్కొన్నారు.


















